సీక్రెట్ బాయ్‌ఫ్రెండ్‌తో ఏం చేస్తున్నావో చూశా.. నటి కూతురికి నెటిజన్ షాక్

by Disha News Desk |
సీక్రెట్ బాయ్‌ఫ్రెండ్‌తో ఏం చేస్తున్నావో చూశా.. నటి కూతురికి నెటిజన్ షాక్
X

దిశ, సినిమా: ప్రముఖ తెలుగు నటి సురేఖా వాణి, కూతురు సుప్రిత సోషల్ మీడియాలో రచ్చ అందరికీ తెలిసిన విషయమే. పొట్టి దుస్తులు ధరించి మాస్ బీట్‌లకు స్టెప్పులేస్తూ భారీ ఫాలోయింగ్ పెంచుకున్న తల్లీకూతుళ్లు.. నిరంతరం అభిమానులతో టచ్‌‌లోనే ఉంటారు. ఈ క్రమంలోనే ఓ నెటిజన్.. 'సుప్రిత నీ సీక్రెట్ బాయ్‌ఫ్రెండ్‏ గురించి చెప్పు. మీ ఫ్రెండ్స్ గ్యాంగ్‏లో ఉన్న అబ్బాయిల్లో ఉన్న నందు నీకేం అవుతాడు. ఆయనే కదా నీ బాయ్ ఫ్రెండ్' అని ప్రశ్నించాడు.

దీంతో ఒక్కసారిగా షాక్ అయిన ఈ అమ్మడు.. 'అవును ప్రతీ అమ్మాయికి అలాంటి ఓ ఫ్రెండ్ కావాలి. ఒక అమ్మాయి, అబ్బాయి స్నేహితులుగా ఉండలేరు అని అందరూ అనుకుంటారు. కానీ మేము మంచి స్నేహితుల్లాగే ఉన్నాం. ఎవరు ఏమనుకున్నా మేం ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్. అయినా మీలా అనుమానించే వారందరికి సమాధానం చెప్పుకుంటూ పోతే నా జీవితం సరిపోదు' అంటూ ఘాటుగా స్పందించింది.

Advertisement

Next Story