ఏం రాధికా మస్తున్నావు లే..గ్రీన్ చుడిదార్‌లో టిల్లు బ్యూటీ అందాల విందు!

by Jakkula Samataha |   ( Updated:2024-05-01 14:58:24.0  )
ఏం రాధికా మస్తున్నావు లే..గ్రీన్ చుడిదార్‌లో టిల్లు బ్యూటీ అందాల విందు!
X

దిశ, సినిమా : డీజే టిల్లు సినిమాతో మంచి ఫేమ్ సంపాదించుకున్న బ్యూటీ నేహా శెట్టి. ఈ ముద్దుగుమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయంతో ఎంతో మందిని ఆకట్టుకుంది ఈ చిన్నది. ఇక నేహా శెట్టి కంటే రాధికా అంటేనే ఈమెను ఎక్కువ గుర్తుపడతారేమో.. ఎందుకంటే 2022 లో వచ్చిన డీజే టిల్లు సినిమాలో ఈ బ్యూటీ తన నటనతో ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాతో ఓవర్ నైట్‌లో స్టార్ స్టేటస్ అందుకుంది టిల్లుగాడి బ్యూటీ.

అయితే ఈ సినిమా తర్వాత ఈ చిన్నదానికి అంతగా అవకాశాలు రావడం లేదు. రీసెంట్‌గా వచ్చిన టిల్లు స్క్వేర్‌లో ఈ బ్యూటీ కనిపించి మరోసారి తన ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చింది. అయితే తాజాగా ఈ నటి విశ్వక్సేన్ తో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీలో నటించింది. ఇక త్వరలో ఈ మూవీ రిలీజ్ కానుండటంతో.. సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటుంది చిత్ర యూనిట్. ఈ క్రమంలోనే ఓ ఈవెంట్‌లో పాల్గొన్న ఈ బ్యూటీ గ్రీన్ చుడిదార్‌‌లో తన అందాలతో కుర్రకారును మాయచేసింది. అందులో స్పెషల్ అట్రాక్షన్‌గా కనిపించి వావ్ అనిపించింది. దీంతో ఇది చూసిన టిల్లు ఫ్యాన్స్.. ఏం రాధిక మస్తున్నావు లే..అందంతో మమ్మల్ని మాయ చేస్తున్నావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, రాధిక ఫొటోస్‌పై మీరు కూడా ఓ లుక్ వేయడండి మరి.

Read More...

అనారోగ్య సమస్యతో బాధపడుతున్న అనసూయ.. అందుకే అలా చేస్తున్నా అంటూ ఆసక్తికర కామెంట్స్

Advertisement

Next Story