- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆత్మహత్యా ప్రయత్నం చేసిన సింగర్
దిశ, సినిమా: సోషల్ మీడియాలో శారీ కట్టుకున్న ఫొటోస్ షేర్ చేయడంతో 16ఏళ్ల క్వీర్ మేకప్ ఆర్టిస్ట్ ప్రియాన్షు యాదవ్ బాడీ షేమింగ్ ఎదుర్కొన్నాడు. ఆ కామెంట్స్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా ఈ ఘటనపై స్పందించిన సింగర్ నేహా భాసిన్.. ‘క్షమించు బెటా.. ఈ ప్రపంచం క్రూరంగా మారింది’ అని బాధపడుతూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టింది. ‘ప్రజెంట్ఉ.5 గంటలు అవుతుంది. నిన్ను హగ్ చేసుకుని ఓదారిస్తే బాగుండేదేమోనని బాధపడుతున్నా. ఈ దునియా బాగుపడదు. నేను కూడా బాడీ షేమింగ్, ట్రోలింగ్ ఎదుర్కొన్నా. 19ఏళ్ల వయసులో చనిపోవాలనుకున్నా. సూసైడ్ అటెంప్ట్ చేశా. కానీ దురదృష్టవశాత్తు బతికా. ఇలాంటి కామెంట్స్‌కు పిల్లలు బాధపడకుండా.. మనమే స్ట్రాంగ్‌గా మార్చాలి. వారిని లవ్ చేయాలి’ అని కోరింది.
కాగా 2022లో ఇన్‌స్టా పోస్ట్ ద్వారా ట్రోలర్స్‌కు బేఫిట్టింగ్ రిప్లయ్ ఇచ్చింది నేహ. ‘మీరు షిట్ వేయడానికి ఇది మీ టాయిలెట్ కాదు. నా టైమ్ లైన్. కాబట్టి నా మీద ఫోకస్ చేయడం ఆపండి. నా లైఫ్, కెరీర్ గ్రేట్‌నెస్ మీ హేట్ వల్ల అస్సలు తగ్గిపోదు. కానీ నన్ను ప్రేమించే ఫ్యాన్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ నా టైమ్ లైన్‌పై ఉన్నారు. మీ హేట్ చూసి వాళ్లు బాధపడొచ్చు. కాబట్టి మీ పని మీరు చూసుకుంటే బెటర్’ అని హెచ్చరించింది.
- Tags
- Neha Bhasin