- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
భార్యలపై ట్రోలింగ్ మాకు ఊహించని మేలు చేసింది: Neelam Kothari
దిశ, సినిమా: బీటౌన్ సీనియర్ యాక్ట్రెస్ నీలమ్ కొఠారి బాలీవుడ్ భార్యలను ఉద్దేశిస్తూ చేస్తున్న ట్రోలింగ్‌పై స్పందించింది. నీలమ్, మహీప్ కపూర్, భావనాపాండే, సీమా సజ్దేవ్కలిసి నటించిన 'ఫ్యాబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్' సీజన్ 2 సెప్టెంబర్ 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతోంది. అయితే ప్రస్తుతం ఈ షో ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్‌లో ఉందని ఇటీవల పోస్ట్ చేసిన కరణ్ జోహార్.. ట్రోలింగ్ కొనసాగించగలంటూ నెటిజన్లను కోరాడు. దీంతో తనదైన స్టైల్‌లో రియాక్ట్ అయిన నీలమ్.. 'ఎవరేమీ చేయాలని ప్రయత్నించినా మా పేర్లే బయటకొస్తాయి. దీంతో మరోసారి మేము ట్రెండింగ్‌లో ఉంటాం. మరింత విజయం సాధిస్తాం. ఏదేమైనా ఒక విషయాన్ని ఇష్టపడేవాళ్లు ఉన్నట్లే.. ద్వేషించేవారూ ఉంటారు. మా షోకు వరల్డ్ వైడ్ ఆదరణ లభిస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. ఇది నన్ను, నా స్నేహితులనుమరింత ధైర్యంగా ముందుకెళ్లేలా ప్రేరేపించింది' అంటూ చెప్పుకొచ్చింది.