Nayanthara: రేపే నయనతార పెళ్లి.. వెడ్డింగ్ కార్డ్ అదిరిందిగా

by Nagaya |   ( Updated:2022-08-11 07:24:21.0  )
Nayanthara vignesh shivan wedding video invitation goes viral
X

దిశ, సినిమా : Nayanthara vignesh shivan wedding video invitation goes viral| బ్యూటిఫుల్ నయనతార-టాలెంటెడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌ ఎట్టకేలకు ఒక్కటి కాబోతున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో వెడ్డింగ్ కార్డ్ వైరల్ అవుతుండగా.. శుక్రవారం మహాబలిపురంలో అంగరంగ వైభవంగా వివాహ మహోత్సవం జరగనుంది. ఈ విషయంపై మీడియాతో మాట్లాడిన శివన్.. తమ ప్రొఫెషనల్ లైఫ్‌కు ఎలా సపోర్ట్ చేస్తున్నారో ఇకపై పర్సనల్ లైఫ్‌కు కూడా అలాగే మద్దతు ఇవ్వాలని ఫ్యాన్స్‌ను కోరాడు. నయన్‌ను పెళ్లి చేసుకుని జీవితంలో మరో ముందడుగు వేయబోతున్నట్లు ఈ సందర్భంగా తెలిపిన శివన్.. పెళ్లి తర్వాత ఫొటోలు షేర్ చేస్తానని చెప్పాడు. జూన్ 11న మీడియాతో కలిసి లంచ్ చేస్తామని, మీడియా ప్రతినిధులందరూ తప్పకుండా హాజరు కావాలని కోరాడు. కాగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, రజినీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి, అనిరుధ్ రవిచంద్రన్, సూర్య, అజిత్, కార్తీ, విజయ్ సేతుపతి, సమంతతో పాటు మరింత మంది ప్రముఖులు ఈ వివాహానికి హాజరుకానున్నారు.

Advertisement

Next Story