పిల్లల కోసం కులదైవం ఆలయంలో ప్రత్యేక పూజలు చేయిస్తున్న నయనతార-విఘ్నేష్

by Anjali |   ( Updated:2023-04-06 07:08:43.0  )
పిల్లల కోసం కులదైవం ఆలయంలో ప్రత్యేక పూజలు చేయిస్తున్న నయనతార-విఘ్నేష్
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళ స్టార్ హీరోయిన్ నయనతార, విఘ్నేష్ కొంతకాలంగా ప్రేమలో ఉండి.. ఏడాది కిందట పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అలాగే సరోగసీ విధానం ద్వారా ఇద్దరు పండంటి మగబిడ్డలకు తల్లిదండ్రులయ్యారు. రీసెంట్‌గా పిల్లలకు నామకరణాలు చేసి ‘‘ఉయిర్ రుద్రోనీల్ ఎన్.శివన్, ఉలగ్ దైవీక్ ఎన్.శివన్’’ అనే పేర్లను కూడా ప్రకటించడం జరిగింది. అయితే తాజాగా... ఈ దంపతులు చిన్నారుల శ్రేయస్సు కోసం తంజావూర్ జిల్లా పాపనాశం సమీపంలోని కులదైవమైన ‘‘మేలవళత్తూర్ ఆట్రంగరై శ్రీ కాంచి కామాక్షి’’ అమ్మవారి గుడిలో ప్రత్యేక పూజలు చేయిస్తున్నారు. అలాగే తాము నటించే సినిమాల గురించి కూడా ప్రత్యేకంగా ప్రార్థించారు. ఆ ఫోటోలు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం వీరిద్దరు సినిమాల్లో చాలా బిజీ అయిపోయారు. నయనతార తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తోన్న ‘‘జవాన్ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. దీనితో పాటు రాఘవా లారెన్స్ సినిమాకు కూడా ఓకే చెప్పేశారు. కమల్ హాసన్ నిర్మాతగా విఘ్నేష్ ఓ సినిమాను చేయాల్సి ఉంది. ఈ చిత్రం ద్వారా దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ హీరోగా పరిచయం కాబోతున్నట్టు తెలుస్తోంది. ఓ వైపు ఫ్యామిలీ లైఫ్‌ను మరోవైపు ప్రోఫెషనల్ జీవితాన్ని హ్యాప్పీగా లీడ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: సొంత నిర్ణయాల వల్ల సమస్యల్లో పడ్డ సమంత ఆసక్తికరంగా ‘శాకుంతలం’ ట్రైలర్

Advertisement

Next Story

Most Viewed