ప్రేక్షకుల ఆశీర్వాదమే నన్ను ఈ స్థాయికి చేర్చింది: Nayanathara

by Prasanna |   ( Updated:2023-01-09 08:18:29.0  )
ప్రేక్షకుల ఆశీర్వాదమే నన్ను ఈ స్థాయికి చేర్చింది: Nayanathara
X

దిశ, సినిమా : స్టార్ హీరోయిన్ నయనతార తన కెరీర్ ఒడిదొడుకుల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. రెండు దశాబ్దాలపాటుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఆమె సుదీర్ఘకాలంగా ఉన్నతమైన స్థానంలో రాణించడం ఊహించినంత సులభం కాదని చెప్పింది. ఇక ఈ ప్రయాణంలో ఎన్నో మంచి చెడులను చూశానని, అవన్నీ దాటుకుని ప్రస్తుతం ఉన్నత శిఖరాలకు చేరినట్లు అనిపిస్తుందని తాజా ఇంటర్య్వూలో తెలిపింది. 'ఏదేమైనా ప్రస్తుతం హ్యాపీగా ఉన్నా. ప్రేక్షకుల ఆదరణ, దేవుడి ఆశీర్వాదం వల్లే ఈ స్థాయికి చేరుకున్నా. అందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. సినిమా పరిశ్రమలో చాలా విషయాలు నేర్చుకున్నా. కెరీర్ విషయంలో నేను చేసిన తప్పుఒప్పులు జ్ఞాపకం ఉన్నాయి. అదంతా నేను నేర్చుకున్న అనుభవంగానే భావిస్తున్నాను. సినిమాలో నటించినా, నిర్మించినా మంచి కథలను ప్రేక్షకులకు అందించడమే నా పని. మంచి కంటెంట్‌తో సినిమాలు తీయాలని ఎల్లప్పుడూ కోరుకుంటా. నిజాయితీ, కమిట్‌మెంట్ ఉంటే అందరూ సక్సెస్ అవుతారు' అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఆమె నటించిన తాజా చిత్రం 'జవాన్' జూన్ 2న ఐదు భాషల్లో విడుదల కానుంది.

Also Read...

"శాకుంతలం" ట్రైలర్ రిలీజ్.. కన్నీరు పెట్టుకున్న సమంత

Advertisement

Next Story