నటుడిపై సంచలన ఆరోపణలు చేసిన పని మనిషి సప్నా.. వీడియో వైరల్

by Hamsa |
నటుడిపై సంచలన ఆరోపణలు చేసిన పని మనిషి సప్నా.. వీడియో వైరల్
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ఫ్యామిలీ ఇష్యూ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. తన మాజీ భార్య ఆలియాతో గొడవలు జరుగుతున్న క్రమంలో.. తాజాగా పని మనిషి సప్నా రాబిన్ మసీహ్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి.

ఈ మేరకు ఆలియా లాయర్ రిజ్వాన్ సిద్ధిఖీ ట్విట్టర్‌ వేదికగా విడుదల చేసిన వీడియోలో ఏడుస్తూ మాట్లాడిన స్వప్నా.. 'నవాజ్ కారణంగా దుబాయ్‌లో చిక్కుకుపోయాను. నా దగ్గర డబ్బులు లేవు. తినడానికి తిండి లేదు. ఎన్నో ఇబ్బందులు పడుతున్నా. పెండింగ్‌లో ఉన్న జీతం చెల్లించండంతోపాటు నేను ఇండియాకు తిరిగి వచ్చేలా ఏర్పాటు చేయాలని మిమ్మల్ని వేడుకుంటున్నా' అని అభ్యర్థించింది. అంతేకాకుండా నవాజ్‌తో కలిసి సప్నా దిగిన ఓ ఫొటోను షేర్ చేసిన సదరు న్యాయవాది.. దుబాయ్‌లో నానా అవస్థలు పడుతున్న ఆమెను రక్షించాలని ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి చేశాడు.

Advertisement

Next Story