చీప్ టీఆర్‌పీ.. మీడియా తీరుపై నవాజుద్దీన్ ఫైర్

by Prasanna |   ( Updated:2023-05-27 11:15:38.0  )
చీప్ టీఆర్‌పీ.. మీడియా తీరుపై నవాజుద్దీన్ ఫైర్
X

దిశ, సినిమా: ‘ది కేరళ స్టోరీ’పై నిషేధానికి మద్దతు ఇస్తున్నట్లు వచ్చిన వార్తలను నవాజుద్దీన్ ఖండించాడు. సినిమాలను నిషేధించే విధానాన్ని తాను ఎప్పటికీ సమర్థించబోనని ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశాడు. ‘‘ది కేరళ స్టోరీ’ని నిషేధించాలనే పిలుపును నేను సపోర్ట్ చేస్తున్నట్లు అనేక మీడియా ప్రచురణలు నివేదించాయి. కేవలం వ్యూస్, పేరు పొందడం కోసం తప్పుడు వార్తలను ప్రచారం చేయడం మానేయండి. దీనిని చీప్ టీఆర్‌పీ అంటారు. అలాగే ఏ సినిమాని నిషేధించాలని నేను ఎప్పటికీ కోరుకోను. మీరు సినిమాలను బ్యాన్ చేయడం ఆపండి. ఫేక్ న్యూస్ వ్యాప్తి చేయడం కూడా మానుకోండి’ అంటూ మీడియా సంస్థలను ఉద్దేశిస్తూ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

Read More... నరేష్ వాళ్ల గురించి అయితే నన్ను ఏమి అడగకండి: కృష్ణ బ్రదర్ ఆదిశేషగిరిరావు

‘మా’ నాకు సరైన బహుమతి ఇచ్చింది.. సస్పెన్షన్‌పై కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్

Advertisement

Next Story