సంగీతంతో ఇంట్లో ఒత్తిడి దూరం చేస్తాడు : అభిషేక్ కోడలు

by sudharani |   ( Updated:2022-11-26 14:05:23.0  )
సంగీతంతో ఇంట్లో ఒత్తిడి దూరం చేస్తాడు : అభిషేక్ కోడలు
X

దిశ, సినిమా : అమ్మమ్మ జయా బచ్చన్, తల్లి శ్వేతా బచ్చన్ మధ్య ఇంట్లో కొనసాగే టెన్షన్ వాతావరణంపై నవ్య నంద ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఆమె హోస్ట్ చేస్తున్న పాడ్ కాస్ట్ 'వాట్ ది వాల్ నవ్య' చివరి ఎపిసోడ్‌లో భాగంగా జయ, శ్వేత పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ ఇంట్లో ఏదో విషయంపై టెన్షన్ పెరుగుతున్న సందర్భాన్ని గుర్తించి మామ అభిషేక్ ఫన్నీగా ఎంట్రీ ఇస్తాడని చెప్పింది. వాళ్లిద్దరి మధ్యలో దూరి టెన్షన్ వాతావరణాన్ని డిఫ్యూజ్ చేస్తాడని తెలిపింది. ఈ క్రమంలోనే మ్యూజిక్ ప్లే చేయడం ప్రారంభించి మొత్తానికి ఆ పరిస్థితిని చెదరగొడతాడని పేర్కొంది. అయితే అది ప్రశాంతమైన సంగీతం కాదని, హౌస్ టెక్ మ్యూజిక్' అని ఫన్నీగా చెప్పుకొచ్చింది. ఇలా తమ కుటుంబంలో అందరూ జిగురు లాంటి మనస్తత్వం కలిగి ఉంటారన్న శ్వేత.. ప్రతి ఒక్కరూ అందరి అభిప్రాయాలను చాలా సీరియస్‌గా తీసుకుంటారని తెలిపింది.

READ MORE

Superstar Krishna విగ్రహం రెడీ.. ఆవిష్కరించేది ఎక్కడో తెలుసా?

Advertisement

Next Story