- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమితాబ్ ఇంట్లో లింగ వివక్షత.. మనుమరాలి కామెంట్స్ వైరల్
దిశ, సినిమా : లింగ వివక్ష లేకుండా తమ ఇంట్లో పిల్లలను పెంచే పద్ధతి గురించి నవ్య నవేలీ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈ మేరకు తల్లి శ్వేతా బచ్చన్.. తనను సోదరుడు అగస్త్య నందను పెంచే విషయంలో ఎలాంటి తేడాలు చూపలేదని చెప్పింది. అలాగే పని విషయంలో మాత్రం గతంలో చూపించిన తేడాలు ఇప్పుడు లేవని, ఆ పరిస్థితి పూర్తిగా మారిందని తెలిపింది. ‘అతిథులు వస్తే గతంలో నేనే టీ చేసేదాన్ని. అగస్త్య వాళ్లతో ఇంటి వ్యవహారాల గురించి మాట్లాడేవాడు. ఆయనకు సేవా చేయాల్సి వచ్చేంది. కానీ ఇప్పుడు అగస్త్య కూడా నాతో సమానంగా పని షేర్ చేసుకుంటున్నాడు. నేను అతనితోపాటే ఇంటి పనులతో పాటు ఆర్థిక బాధ్యతలను కూడా నిర్వహించగలుగుతున్నా. ప్రతి పని మాకు సమానంగా విభజించబడింది. ఇద్దరం సంపాదించడంలో బిజీ అయ్యాము. ఇప్పుడు మాకు డబ్బు విలువ అర్థమైంది. అన్ని రంగాల్లోనూ అగస్త్య చేసే ప్రతి పనిని నేను చేస్తున్నా. ఈ విషయంలో మా అమ్మమ్మతాతయ్యలు అమితాబ్, జయాలకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నా’ అంటూ వివరించింది.
Read More: నమ్మించి మోసం చేసిన ప్రియుడు.. సెట్‌లోనే గుండె పగిలేలా ఏడ్చిన నటి