- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న నవీన్ పొలిశెట్టి.. క్లారిటీ!
దిశ, సినిమా: ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు నటుడు నవీన్ పొలిశెట్టి. అదే ఏడాది ‘చిచోర్’ అనే హిందీ చిత్రంలో అవకాశం దక్కించుకుని అందులో ముఖ్య పాత్రలో నటించాడు. తర్వాత తెలుగులో లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, డి ఫర్ దోపిడీ, నేనొక్కడినే, జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ఉత్తమ నటుడిగా ముద్ర వేసుకున్నాడు. ఇదంత పక్కన పెడితే.. ఈ హీరో సీక్రెట్‌గా ఓ అమ్మాయిని వివాహం చేసుకున్నాడంటూ సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. పెళ్లైన విషయాన్ని నవీన్ పొలిశెట్టి సీక్రెట్‌గా ఉంచుతున్నాడని అంటున్నారు.
నవీన్ పొలిశెట్టి యాక్సిడెంట్ అనంతరం అమెరికాలోనే ఎక్కువగా ఉంటున్నాడని, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రం రిలీజైన సమయంలో కూడా అమెరికాకు వెళ్లి అక్కడే ఉన్నారు, అక్కడే వివాహం చేసుకుని సెటిల్ అయ్యాడంటూ నెట్టింట టాక్ వినిపిస్తుంది. దీనిపై ఫిలింఫేర్ అవార్డ్స్ లో పాల్గొన్న నవీన్ పోలిశెట్టి క్లారిటీ ఇచ్చాడు. రహస్యంగా పెళ్లి చేసుకున్నారా? అని మీడియా వారు ప్రశ్నించగా..
‘లేదు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలన్నీ అవాస్తవాలు మాత్రమే. నేను లైఫ్‌లో సెటిల్ అయ్యాకనే చేసుకుంటాను. అంతేకాకుండా నేను వివాహమాడబోయే అమ్మాయి గురించి కూడా ముందుగానే ప్రకటిస్తాను. నా పెళ్లిపై వచ్చే వార్తలన్నీ జస్ట్ గాసిప్ మాత్రమే’. అంటూ నవీన్ పొలిశెట్టి క్లారిటీ ఇచ్చాడు.