అనుష్క ఇచ్చే కౌగిలింతల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నవీన్ పొలిశెట్టి..

by Anjali |   ( Updated:2023-08-23 09:11:56.0  )
అనుష్క ఇచ్చే కౌగిలింతల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నవీన్ పొలిశెట్టి..
X

దిశ, సినిమా: ‘జాతిరత్నాలు’ చిత్రంతో మంచి క్రేజ్ సంపాదించుకున్న నవీన్ పొలిశెట్టి రెండేళ్ల గ్యాప్ తర్వాత ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అనుష్క శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 7న రిలీజ్ కానుంది. దీంతో నవీన్ పొలిశెట్టి ప్రమోషన్ బాధ్యతలు తీసుకున్నాడు. పలు ఇంటర్వ్యూలు, తదితర కార్యక్రమాల్లో పాల్గొంటూ సందడి చేస్తున్నాడు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనుష్క గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘స్టార్ హీరోయిన్ అనుష్క పక్కన నటించడం అంత సులువు కాదు. షూటింగ్ ప్రారంభంలో మొదటి రెండు రోజులు కాస్త ఇబ్బంది పడ్డాను.

కానీ ఆమె ఇచ్చిన ప్రోత్సాహంతో ఫ్రీగా నటించగలిగాను. సినిమాలో మా ఇద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. అది ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది. ముఖ్యంగా అనుష్క సెట్‌లో అందరితో ఫ్రెండ్లీగా ఉంటుంది. ముందు సెట్‌లోకి రాగానే టెక్నీషియన్లకు, తోటి నటీనటులకు అభిమాన పూర్వకంగా హగ్ ఇస్తుంది. దీంతో నేను కూడా అనుష్క నుంచి ఆ అలవాటు నేర్చుకున్నాను. ఆమెలో ఉన్న మంచి క్వాలిటీస్‌లో ఇదొకటి’ అంటూ చెప్పుకొచ్చాడు నవీన్.

Read More : లావణ్యను పెళ్లి చేసుకున్నాక నేనూ మారిపోతా.. కుండబద్దలు కొట్టిన వరుణ్ తేజ్

Advertisement

Next Story

Most Viewed