Hardik Pandya : అయిపోయింది.. అంతా అయిపోయింది.. నిండా మునిగిన హార్దిక్ పాండ్య

by Sujitha Rachapalli |
Hardik Pandya : అయిపోయింది.. అంతా అయిపోయింది.. నిండా మునిగిన హార్దిక్ పాండ్య
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటి నటాషా.. హార్దిక్ పాండ్య జీవితం కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఓ రోజు విడిపోయారంటే.. మరో రోజు లేదు కలిసి ఉంటారట.. ఇదంతా హైప్ కోసం.. లేదంటే తప్పుదోవ పట్టించడం అంటూ.. ఈ ఇద్దరి విడాకుల మ్యాటర్ చర్చకు వస్తూనే ఉంది. ఈ మధ్య అనంత్ అంబానీ పెళ్లిలోనూ ఇదే డిస్కషన్ జరిగింది. నటాషా బాయ్ ఫ్రెండ్ తో మ్యారేజ్ కు వస్తే.. హార్దిక్ ఒంటరిగానే అటెండ్ అయ్యాడు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పిచ్చి పిచ్చిగా డ్యాన్స్ చేసి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం హార్దిక్ పాండ్య భార్య కొడుకును తీసుకుని తన సొంత దేశం సెర్బియాకు వెళ్లిపోయినట్లు తెలుస్తుంది. దీంతో క్రికెటర్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. అంతా అయిపోయింది.. కొడుకుతో సహా భార్య మరోచోట ఉండబోతుంది అని కామెంట్స్ చేస్తున్నారు. ఇకపై ఒంటరిగా ఉండబోతున్న హార్దిక్ నిండా మునిగిపోయాడు.. ఇకపై ఆయన లైఫ్ ఎలా ఉంటుందో అని బాధపడుతున్నారు. అమెలాగే మరో భాగస్వామిని చూసుకుని హ్యాపీగా ఉండాలని సూచిస్తున్నారు.

Advertisement

Next Story