'కృష్ణగారితో నాకు అక్రమ సంబంధం అంటగట్టాడు'.. నరేష్‌ భార్య షాకింగ్ కామెంట్స్

by samatah |   ( Updated:2023-01-06 09:58:50.0  )
కృష్ణగారితో నాకు అక్రమ సంబంధం అంటగట్టాడు.. నరేష్‌ భార్య షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్ : 2022లో ఎక్కువ హాట్ టాపిక్‌గా మారిన సెలబ్రిటీలలో నరేష్, పవిత్రాలోకేష్ ఒకరు. వీరిపై గతంలో అనేక ట్రోల్స్ వచ్చాయి. కాగా ఎట్టకేలకు 2023లో ట్రోలింగ్స్‌కు ఎండ్ కార్డ్ వేస్తూ.. లిప్ లాక్ కిస్‌తో మేము ఏకం అవుతున్నాం, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ ఓ వీడియోను రిలీజ్ చేశారు.

అయితే నరేష్‌కు ఇప్పటికే మూడు పెళ్లీలు జరిగిన విషయం తెలిసిందే. ఇక మూడో భార్య రమ్య రఘుపతికి ఇంకా విడాకులు ఇవ్వలేదు. విడాకులు ఇవ్వకముందే ఆయన నాలుగో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో రమ్యరఘుపతి రెడ్డి మాట్లాడుతూ.. నరేష్‌కు సంబంధించిన అనేక విషయాలను బయటపెట్టింది.

గతంలో నరేష్ విడాకులు ఇవ్వమని, నా కాళ్లు కూడా పట్టుకున్నాడని తెలిపిన విషయం తెలిసిందే. కాగా మరిన్ని సంచలన నిజాలను వెళ్లడించింది. అందులో మరీ ముఖ్యంగా కృష్ణగారి పేరుతో నరేష్ చేసిన అరాచకాలను తెలిపింది. ఆమె ఎమన్నదంటే.. 'నన్ను వదిలించుకోవడానికి నరేష్ దారుణాతి దారుణాలు చేశాడు. ముఖ్యంగా దేవుడులాంటి మా మమయ్యతో నాకు అక్రమ సంబంధం అంటగట్టాడు. అంతటితో ఆగకుండా, నా నుంచి కృష్ణగారికి ప్రాణహాని ఉందని మా మయ్య సంతకం పోర్జరీ చేసి, నాపై పోలీస్టేషన్‌లో కేసు నమోదు చేశాడు. ఈ విషయం ఇంకా కృష్ణగారికి తెలియదని పేర్కొంది. అలాగే నేను అస్సలే నరేష్‌కు విడాకులు ఇవ్వను, నా కొడుకు డాడీ కావాలి అంటున్నాడు, నేను అస్సలు వారి పెళ్లి జరగనివ్వను అంటూ తేల్చి చెప్పింది. ప్రస్తుతం రమ్యరఘుపతి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ఇవి కూడా చదవండి: కౌగిలింతతో మానసిక ఒత్తిడి దూరం..మధురానుభూతి సొంతం

న్యూ లుక్‌తో బరిలోకి సమంత.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ

Advertisement

Next Story

Most Viewed