నరేష్- పవిత్రల కలయికలో మరో సినిమా!

by Anjali |   ( Updated:2023-06-08 07:55:53.0  )
నరేష్- పవిత్రల కలయికలో మరో సినిమా!
X

దిశ, సినిమా: సీనియర్ నటుడు నరేష్ , పవిత్ర లోకేష్ గురించి మరోవార్త హల్ చల్ చేస్తోంది. రీసెంట్‌గా విడుదలైన మూవీ ‘మళ్ళీ పెళ్లి’తో మరింత ఫేమస్ అయిపోయిన ఈ జోడి.. ఇందులో వారీ జీవితాలు కళ్లకు కట్టినట్టుగా చూపించుకున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం పవిత్రలో మరిన్ని సినిమాలు చేయాలని నరేష్ డిసైడ్ అయ్యాడట. అది కూడా ఇతర భాషల్లో సక్సెస్ అయిన కథలు తీసుకొని తెలుగులో రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట. ‘మా వయసుకు తగ్గట్లు కథలు దొరికితే మీ ముందుకు వస్తాం’ అని ఓ సమావేశంలో నరేష్ చెప్పినట్లు తెలుస్తోంది.

Read more:

Akkineni Amala :అమల ఏ దేశానికి చెందిన మహిళనో, తన తల్లి ఎవరో తెలుసా?

Advertisement

Next Story