‘ఇంటింటి రామాయణం’ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది: మేకర్స్

by sudharani |   ( Updated:2023-03-10 15:12:19.0  )
‘ఇంటింటి రామాయణం’ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది: మేకర్స్
X

దిశ, సినిమా: సూర్యదేవర నాగవంశీ, మారుతి టీమ్ సమర్పణలో ఐవీవై ప్రొడక్షన్స్ నిర్మాణంలో వస్తున్న కుటుంబ కథా చిత్రం ‘ఇంటింటి రామాయణం’. వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ యిన్నమూరి నిర్మాతలుగా వ్యవహరించిన సినిమాలో నరేష్, రాహుల్ రామకృష్ణ, నవ్య స్వామి, సురభి ప్రభావతి, గంగవ్వ ప్రధాన పాత్రలు పోషించగా సురేష్ నరెడ్ల దర్శకత్వం వహించాడు. గ్రామీణ నేపథ్యంలో మధ్యతరగతి కుటుంబ కథగా తెరకెక్కిన ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.

ఈ నేపథ్యంలో విలేకర్ల సమావేశం నిర్వహించిన చిత్ర బృందం పలు విశేషాలను పంచుకున్నారు. ‘‘బలగం’ సినిమా కూడా తెలంగాణ నేపథ్యంలోనే రూపొందింది. ఈ సినిమా దానికి భిన్నంగా ఉంటుంది. నరేష్ తెలంగాణ మాండలికాన్ని అద్భుతంగా పలికారు. చిన్న సినిమాలను ఆదరించండి. ఇలాంటి మంచి చిత్రాలను ప్రోత్సహించండి. ఈ సినిమా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది’ అన్నారు.

Also Read..

షారుఖ్ ‘జవాన్’ నుంచి వీడియో లీక్ .. అదిరిపోయిన ఫైట్ సీక్వెన్స్

Advertisement

Next Story