నాని 'దసరా' టీజర్.. గూస్‌బంప్స్ మోమెంట్స్‌తో హైప్

by sudharani |   ( Updated:2023-01-30 12:11:45.0  )
నాని దసరా టీజర్.. గూస్‌బంప్స్ మోమెంట్స్‌తో హైప్
X

దిశ, సినిమా: నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన చిత్రం 'దసరా'. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాలో కీర్తి సురేష్ కథానాయికగా నటించింది. ఇక నాని అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా నుంచి టీజర్‌ రిలీజ్ అయింది. రాజమౌళి చేతుల మీదుగా విడుదలైన టీజర్‌లో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ కవర్ చేస్తూ ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేశారు.

నాని రగ్డ్ లుక్, మాస్ యాటిట్యూడ్, డైలాగ్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తుండగా.. బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందంటున్నారు ఫ్యాన్స్. ఇక సంతోష్ నారాయణ్ సంగీతం సమకూరుస్తున్న సినిమా మార్చి 30న తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.

READ MORE

కన్నడలో సంచలనం సృష్టించిన 'వేద'.. తెలుగులో విడుదలకు సన్నాహాలు

Advertisement

Next Story