నాని ‘దసరా’.. మహేష్ బాబు రివ్వూ

by sudharani |   ( Updated:2023-04-01 14:45:20.0  )
నాని ‘దసరా’.. మహేష్ బాబు రివ్వూ
X

దిశ, వెబ్‌డెస్క్: నేచురల్ స్టార్ నాని హీరోగా.. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘దసరా’. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ కలెక్షన్లలో దుమ్ము రేపుతోంది. ఇదిలా ఉంటే.. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ‘దసరా’ సినిమాపై రివ్వూ ఇచ్చేశారు. తాజాగా మహేష్ బాబు ‘దసరా’ మూవీ చూసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ‘‘దసరా’ చాలా గర్వంగా ఉంది!! ఇది అద్భుతమైన సినిమా!’’ అనే క్యాప్షన్ ఇచ్చి షేర్ చేశారు. ఈ పోస్ట్ కాస్త వైరల్ కావడంతో నాని అభిమానులు మహేష్ బాబును ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Advertisement

Next Story