Dasara Movie: నేను మీకు మాటిస్తున్నా.. మనసుని హత్తుకునే సినిమా చూపిస్తా

by Prasanna |
Dasara Movie: నేను మీకు మాటిస్తున్నా.. మనసుని హత్తుకునే సినిమా చూపిస్తా
X

దిశ, సినిమా : ‘సినిమా వాళ్లకు ఓ ప్రత్యేకమైన భాష ఉంటుంది. మా వరకూ సీడెడ్ అంటే మాస్ అని అర్థం. ఇప్పటి వరకూ మిమ్మల్ని మెప్పించే మాస్ మూవీ చూసివుంటారు. కానీ, ‘దసరా’తో మీ మనసుని హత్తుకునే మాస్ సినిమా చూపిస్తా. ఇదే నేను మీకు ఇస్తున్న మాట’ అని చెబుతున్నాడు నాని. ఆయన నటించిన ‘దసరా’ మార్చి 30న విడుదలకానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్న హీరో తాజా ఇంటర్య్వూలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ మేరకు ఈ మూవీ చూస్తున్న ప్రతి ఒక్కరూ భావోద్వేగంతో విజిల్స్ వేస్తారని, దుమ్ము దూళిని లెక్కచేయకుండా ఒక యేడాది పాటు ఈ చిత్రం కోసం కష్టపడినట్లు చెప్పాడు. అంతేకాదు తన మనసుకు దగ్గరైన ఈ చిత్రం టీమ్ మొత్తానికి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొస్తుందన్నాడు. చివరగా దర్శక నిర్మాతలు, టెక్నీషియన్స్, ఫైట్ మాస్టర్, ఎడిటర్, సినిమాకోసం కష్టపడి పనిచేసిన అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు.

Advertisement

Next Story