- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సినీ ఇండస్ట్రీలో నంది అవార్డుల రగడ
దిశ, డైనమిక్ బ్యూరో :నంది అవార్డు అంటే సినీ నటులకు అత్యంత ప్రతిష్టాత్మకం. నంది అవార్డు వచ్చిందంటే అప్పట్లో ఆస్కార్ అవార్డు వరించినట్లే.నంది అవార్డును ఒకప్పుడు సినీ ఇండస్ట్రీ చాలా గొప్పగా భావించేది. అది తమ ఘనతగా చెప్పుకునేది. అంతేకాదు సినిమా వాల్ పోస్టర్లపైనా, రికార్డులలోనూ నంది అవార్డుకు ప్రత్యేక స్థానం కల్పించే వారు. అలాగే ప్రభుత్వం సైతం ప్రతీ ఏడాది నంది అవార్డుల ప్రధానోత్సవకార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేది. అవార్డుల వేడుక కన్నుల పండువగా జరిగేవి. సినీ రంగంలోని 24 రంగాలల్లో ప్రతిభ కనబర్చిన వారికి నంది అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం అందించేది. ముఖ్యమంత్రి దగ్గర నుంచి క్యాబినెట్ మెుత్తం ఆ వేడుల్లో తలమునకలయ్యేది. అంతలా ప్రతిష్టాత్మకంగా భావించే నంది అవార్డుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహించాయి అని చెప్పుకోవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ వేడుకలు కొద్దోగొప్పో జరిగినా విభజన అనంతరం అసలు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు పట్టించుకోవడం మానేశాయి. నంది అవార్డులు ఇవ్వడం లేదనే ఫ్రస్టేషన్‌లోనో లేక ఎందుకో తెలియదు గానీ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలోనే పెద్దలు అందులోనూ రాజకీయ ప్రాబల్యం ఉన్న వారు చేస్తున్న వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఒక నటుడు కులం రంగు పూస్తుంటే మరోనటుడు ప్రాంతం అంటగడుతున్నారు. ఇంకోకరైతే అసలు నంది అవార్డులకు వాల్యూయే లేదంటున్నారు. మెుత్తానికి టాలీవుడ్‌లో నంది అవార్డులపై చెలరేగుతున్న రగడపై ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో అన్నది చర్చనీయాంశంగా మారింది.
నంది అవార్డుల వాల్యూ పోయింది:ఆదిశేషగిరిరావు
నంది అవార్డులపై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆసక్తి లేదని సినీ నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు అన్నారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తెలుగు సినిమా పరిశ్రమను పట్టించుకోవడం లేదని వాపోయారు. ప్రభుత్వాలకు అనుకూలంగా ఉన్న వారికే అవార్డులు ఇస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఉద్దేశంలో అసలు అవార్డులకు ప్రాధాన్యత అనేది లేదని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు నంది అవార్డులు అంటే ఎంతో గొప్పగా ఉండేదని ఆ వాల్యూయే వేరని కానీ ఆ వాల్యూ ఇప్పుడు లేదని చెప్పుకొచ్చారు. ప్రతీ ఏడాది నంది అవార్డుల కంటే సంతోషం అవార్డులు ఘనంగా నిర్వహిస్తున్నారని ఆదిశేషగిరిరావు అన్నారు. మే31న సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా మోసగాళ్లకు మోసగాడు సినిమాను 4కే క్వాలిటీతో పద్మాలయా స్టూడియో విడుదల చేస్తన్నట్లు అదిశేషగిరిరావు ప్రకటించారు. కలర్ పరంగా సౌండ్, మ్యూజిక్ పరంగా అన్ని హంగులతో మోసగాళ్లకు మోసగాడు తీర్చి దిద్దామని పేర్కొన్నారు. అలాగే కృష్ణ జన్మదినం నాడు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. కృష్ణ మెమోరియల్ కోసం ప్రభుత్వం స్థలం ఇస్తామని చెప్పిందని, తమ సొంత స్థలంలోనే మెమోరియల్‌గా మ్యూజియమ్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. బుర్రిపాలెంలో సీనియర్ సిటిజిన్ హోం నిర్మిస్తున్నామన్నారు. ఇదివరకు ప్రభుత్వ అవార్డులకు వాల్యూ ఉండేదని, ఇప్పుడు లేదని ఆదిశేషగిరి రావు వ్యాఖ్యానించారు.
ఉత్తమ రౌడీ,ఉత్తమ గూండాలకు అవార్డులు:అశ్వనీ దత్
నిర్మాత అశ్వనీ దత్ సైతం నంది అవార్డులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం నంది అవార్డుల విషయంలో నడుస్తున్న సీజన్ వేరు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ రౌడీ, ఉత్తమ గూండా అవార్డులు ఇస్తున్నారని ఆరోపించారు. రెండు మూడేళ్లలో తిరిగి ప్రభుత్వాలు అవార్డులు ఇవ్వటం మొదలవుతుంది. అప్పుడు మనందరికీ అవార్డులు వరిస్తాయి అని అశ్వనీ దత్ ఆశాభావం వ్యక్తం చేశారు.
కమ్మనంది అన్న పోసాని
ఈ నంది అవార్డులపై రచ్చకు శ్రీకారం చుట్టింది నటుడు పోసాని కృష్ణమురళి. నంది అవార్డులు కమ్మ అవార్డులు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తనకు నంది అవార్డు వచ్చిందని అయితే అది కమ్మ నంది అవార్డు అని తేలడంతో వద్దని తిరిగి ఇచ్చేసినట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. అంతేకాదు నంది అవార్డుల ఎంపికకోసం ఏర్పాటు చేసే జ్యూరీ కమిటీపైనా సంచలన ఆరోపణలు చేశారు. నంది అవార్డుల ఎంపిక చేసే కమిటీల్లో ఉన్న 12 మందిలో 11 మంది కమ్మవారే అని ఆరోపించిన సంగతి తెలిసిందే. కొంత మంది రైటర్‌లు, ఆర్టిస్టులు నందులను పంచుకునేవారని... నందీ అవార్డులు పంచుకునే విషయంలో చాలా మంది దర్శక నిర్మాతలు నష్టపోయారంటూ బాంబు పేల్చిన సంగతి తెలిసిందే.
కులం, మతం చూసి అవార్డులు ఇవ్వరు : ప్రొడ్యూసర్ కౌన్సిల్
అయితే నంది అవార్డులపై పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలపట్ల ఆనాడు ప్రొడ్యూసర్ కౌన్సిల్ సైతం స్పందించింది. పోసాని వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ స్పష్టం చేశారు. పార్టీ పరంగా మాట్లాడి ఉండవచ్చని వ్యాఖ్యానించారు. నంది అవార్డుల ఎంపిక అనేది చాలా పారదర్శకంగా జరిగిందని...జాతీయ అవార్డుల విషయంలోనూ ఇలాంటి కామెంట్స్ తరచూ వినిపిస్తూనే ఉంటాయన్నారు. సినిమాలో దమ్ముంటే కులం, మతం, జాతి, ప్రాంతం అనేది చూడరని చెప్పుకొచ్చారు. టెంపర్ సినిమాలో నటించినందుకు పోసాని కృష్ణమురళికి అవార్డు వచ్చిందని అయితే అది కులం, మతం చూసి ఇవ్వలేదని ఆయన నటన చూసి ఇచ్చారని ప్రసన్నకుమార్ కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి : ‘‘నిన్ను.. నీ నవ్వును ఎప్పటికీ మర్చిపోలేము’’.. శ్రద్ధా దాస్ ఎమోషనల్ పోస్ట్ వైరల్