ఆ పని చేయాలంటే చెప్పలేనంత భయం.. టెన్షన్‌తో నిద్ర పట్టదు

by Vinod kumar |   ( Updated:2023-02-08 14:28:55.0  )
ఆ పని చేయాలంటే చెప్పలేనంత భయం.. టెన్షన్‌తో నిద్ర పట్టదు
X

దిశ, సినిమా: నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'అమిగోస్'. మనిషిని పోలిన మనుషులు ఎదురుపడితే ఎలా ఉంటుందనే ఒక కొత్త కాన్సెప్ట్‌తో ఈ సినిమాను మైత్రీ మేకర్స్ నిర్మించారు. రాజేంద్ర రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ మూవీ ఫిబ్రవరి 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో జోరుగా ప్రమోషన్స్‌ను నిర్వహిస్తున్నాడు కళ్యాణ్ రామ్.

అయితే తాజాగా మీడియాతో ముచ్చటించిన ఆయన.. 'మొదటి నుంచి నాకు డాన్స్ అంటే భయం. ఒక రకమైన షివరింగ్. నా మూవీలో డాన్స్ చేయాలంటే రెండు మూడు రోజుల పాటు టెన్షన్‌తో నిద్ర పట్టదు. రిహార్సల్స్ లేదా వన్ మోర్ అంటే ఇక మరింత టెన్షన్‌గా ఉంటుంది. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ఇలాంటి టెన్షన్ 'అమిగోస్' మూవీలో ఎదుర్కోవాల్సి వచ్చింది' అని చెప్పుకొచ్చాడు.

Also Read..

ఆసక్తిరేకెత్తిస్తున్న ధనుష్ 'సార్' మూవీ ట్రైలర్..!

Advertisement

Next Story