- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bigg Boss - Season 8: బిగ్‌బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న నందమూరి హీరో.. ఎవరంటే!!
దిశ, సినిమా: త్వరలోనే తెలుగు బిగ్‌బాస్ సీజన్ -8 ప్రారంభమవ్వబోతుంది. ఈ నేపథ్యంలో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్లు ఎవరంటూ ఆడియన్స్ అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. సినీ సెలబ్రిటీలు అని, సోషల్ మీడియా ద్వారా ఫేమ్ దక్కించుకున్న పలువురు వ్యక్తులని రోజుకో వార్త తెరపైకి వస్తుంది. ఈ క్రమంలో బిగ్ బాస్ హౌస్‌లోకి ఓ హీరో ఎంట్రీ ఇవ్వనున్నాడంటూ మరో ఆసక్తికర విషయం బయటపడింది. మరీ ఆ పర్సన్ ఎవరో కాదు.. నందమూరి హీరో చైతన్య కృష్ణ. నందమూరి వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. జగపతిబాబు కథానాయకుడిగా నటించిన ‘ధమ్’ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించారు. తర్వాత బ్రీత్ అనే సినిమాలో చైతన్య హీరోగా అవకాశం దక్కించుకున్నారు.
ఇదంతా పక్కన పెడితే ఈ హీరో నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న తెలుగు బిగ్‌బాస్ సీజన్-8లోకి ఎంట్రీ ఇచ్చి.. ప్రేక్షకుల్ని అలరించబోతున్నాడని నెట్టింట టాక్ వినిపిస్తుంది. 99 శాతం వాస్తమే అయినప్పటికీ దీనిపై అధికారికంగా మాత్రం ప్రకటించలేదని నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇకపోతే ఇప్పటికే బిగ్‌బాస్ సీజన్-8 నుంచి మూడు ప్రోమోలు రిలీజ్ అయ్యాయి. ఈ సారి హౌస్‌లోకి రీతూ చౌదరి, విష్ణు ప్రియ, యాష్మి గౌడ, యూట్యూబర్ బంచిక్ బబ్లు, తేజస్విని గౌడ, సీనియర్ నటి సనా, యాదమ్మరాజు, కిర్రాక్ ఆర్పీ, సింగర్ సాకేత్, అబ్బాస్,జబర్దస్త్ పవిత్ర, వేణు స్వామి, నిఖిల్, ప్రేరణ, ఏక్నాథ్ - హారిక, సౌమ్య జాను, యాంకర్ సౌమ్య రావు పేర్లు వినిపిస్తున్నాయి.