- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Devara update: నందమూరి ఫ్యాన్స్ గెట్ రెడీ.. ఆ స్పెషల్ డే నాడు ‘దేవర’ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్!
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘దేవర’. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అలాగే సైఫ్ అలీఖాన్ విలన్‌గా మెప్పించనున్నాడు. ఇందులో అతిలోక సుందరి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.
దేవరతో ఈ అమ్మడు టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతోంది. అయితే ఇప్పటికే దేవర నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ భారీ అంచనాలను పెంచడంతో తారక్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రజెంట్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా రెండు పార్టులుగా రాబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించడంతో.. అందరి దృష్టి దేవర మూవీ పైనే పడింది. అయితే ఈ సినిమా సెప్టెంబర్ 27న విజయదశమి కానుకగా థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది.
ప్రస్తుతం దేవర పోస్ట్ ప్రొడక్షన్ పనులు అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో.. తాజాగా, ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరిలో ఆసక్తిని పెంచుతోంది. ఆగస్టు 15 రాబోతుంది అలాగే ఆగస్టు 16న సైఫ్ అలీ ఖాన్ పుట్టిన రోజు కూడా ఉండటంతో.. మేకర్స్ అప్డేట్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. దేవర నుంచి సైఫ్ బర్త్ డే నాడు ఆయన క్యారెక్టర్‌కు సంబంధించిన వీడియోను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న తారక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
Read More..
Ram Charan: రాజమౌళి డాక్యుమెంటరీపై గ్లోబల్ స్టార్ రియాక్షన్.. ఇదే అసలైన గౌరవం అంటూ ఆసక్తికర పోస్ట్