- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కంటెస్టెంట్లతో నాగార్జున జోకులు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లేకుండా చివరి రోజు.. ఆకట్టుకుంటోన్న లేటెస్ట్ ప్రోమో
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు బిగ్‌బాస్ సీజన్ 8 సెప్టెంబర్ 1న మొదలై ఇప్పటికే ఐదు వారాలు పూర్తి చేసుకుంది. ఇందులో 14 మంది కంటెస్టెంట్స్ పాల్గొనగా.. నాలుగు వారాల్లో నలుగురు ఎలిమినేట్ అయి ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. అయితే ఇటీవల మిడ్ వీక్‌లో ఆదిత్య ఓం ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. కానీ దీనిపై అధికారిక ప్రకటన లేదు. అయితే ఇంట్లో మాత్రం అతను కనిపించట్లేదు. దీంతో ఆదిత్య బయటకు వెళ్లినట్లు టాక్. ఇదిలా ఉంటే.. ప్రజెంట్ బిగ్‌బాస్ హౌస్‌లో ప్రతి రోజు పలు టాస్కులతో షో చాలా రసవత్తరంగా మారుతోంది.
అయితే ఎప్పటి లాగానే వీకెండ్ రానే వచ్చింది. అయితే ప్రతి శనివారం నాగార్జున హౌజ్‌మేట్స్ గేమ్ ఎలా ఉందని చెప్పి వాటిలో తప్పొప్పులను చెప్తారు. కొన్ని సార్లు ఒకరిద్దరిని సేవ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా, బిగ్‌బాస్ నుంచి లేటెస్ట్ ప్రోమో విడుదలై అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే ఇందులో గుర్తు పెట్టుకోండి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లేకుండా ఇవాళే మీకు ఆఖరి రోజు అని నాగార్జున కంటెస్టంట్లతో అన్నారు. ఆ తరువాత హౌస్‌మేట్స్‌కు ఓ గేమ్ పెట్టాడు. ప్రతి ఒక్కరు రెండు అద్దాలు తీసుకోవాలన్నారు. ఈ అద్దంలో హౌస్‌లో ఎవరి ఫేస్ చూపించాలని అనుకుంటున్నారో చెప్పాలన్నారు. నిఖిల్ ఫేస్‌ను చూపెడుతూ చీఫ్ పదవి నుంచి దిగిపోయిన తరువాత నా కంటే చిన్న పిల్లాడిలా బిహేవ్ చేస్తున్నాడని విష్ణు ప్రియ అంది. చీఫ్ నుంచి దిగిపోయాకనా.. సోనియా వెళ్లిపోయాకనా అని నాగార్జున ప్రశ్నించారు. దీంతో అక్కడ నవ్వులు విరిశాయి.
ఆ తరువాత ఒక్కొక్కరుగా అద్దాలలో తాము ఎవరిని చూపించాలని అనుకుంటున్నారో వాళ్లని చూపించారు. ఇక ఆఖరిలో యష్మి ఏడ్చింది. వాళ్ల నాన్నపంపిన మెసేజ్‌లో ఓ మూడు పదాలను చెబుతానని, అయితే.. అందుకు ఇప్పటి వరకు ఎవ్వరికి చెప్పని సీక్రెట్‌ను చెప్పాలని నాగ్ అన్నారు. దీంతో కాలేజీ రోజుల్లో తాను ఓ అబ్బాయిని ప్రేమించానని యష్మి అంది. తన చేతిపై టాటూగా వేసుకున్న ఆర్, ఎస్ అంటూ చూపించింది. అయితే.. పేరు మాత్రం వద్దని అంది. ఫైనల్‌గా ప్రొమో మాత్రం అదిరిపోయింది. మరి ఇంకేందుకు ఆలస్యం మీరు కూడా బిగ్‌బాస్ లేటెస్ట్ ప్రోమో చూసేయండి.
(video link credits to STAR MAA youtube channel)