అనుష్క పెళ్లి చేసుకోకపోవడానికి కారణం నాగార్జున??

by sudharani |   ( Updated:2023-09-28 14:48:04.0  )
అనుష్క పెళ్లి చేసుకోకపోవడానికి కారణం నాగార్జున??
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క గురించి పరిచయం అక్కర్లేదు. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘సూపర్’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన అనుష్క ‘బాహుబలి’ మూవీతో దేవసేనగా ప్రపంచం వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నాగార్జున హీరోగా వచ్చిన ‘సూపర్’ మూవీలో అనుష్క సెకండ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

అప్పటి నుంచి వీళ్లిద్దరి మధ్య మంచి ఫ్రెండ్‌షిప్ ఏర్పడింది. అంతేకాదు అప్పట్లో ఆయన అనుష్కతో రిలేషన్‌షిప్‌లో ఉండటం వల్ల ఆఫర్లు కూడా ఇప్పించాడని టాక్ వినపడింది. కానీ అనుష్క తనకు తానుగా ఇమేజ్ క్రియేట్ చేసుకుని అవకాశాలు తెచ్చుకుందని విమర్శకులు ఒప్పుకోక తప్పలేదు. అయితే కెరీర్‌లో సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. పెళ్లి విషయంలో మాత్రం వెనుకడుగు వేస్తుంది. దీంతో నాగార్జున‌తో ఆమె ఇంకా రిలేషన్‌షిప్‌లో ఉండడం వల్లే.. ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదని పుకార్లు వినిపిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed