హీరోయిన్ల బాధలను అర్థం చేసుకునే నిజమైన హీరో.. కింగ్‌పై మమతా ప్రశంసలు

by Vinod kumar |
హీరోయిన్ల బాధలను అర్థం చేసుకునే నిజమైన హీరో.. కింగ్‌పై మమతా ప్రశంసలు
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరోయిన్ మమతా మోహన్ దాస్ గురించి పరిచయం అక్కర్లేదు. అనతి కాలంలోనే స్టార్ హీరోలతో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మమతా.. హీరో నాగార్జున గురించి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది. ‘నాకు నాగార్జున నటించిన ‘కేడి’ సినిమాలో హీరోయిన్గా అవకాశం వచ్చింది. కానీ, అదే సమయంలో నేను క్యాన్సర్ బారిన పడ్డాను. దీంతో ఆ సినిమా చేయలేనని చెప్పాను. వారం తర్వాత నాగార్జునగారు నాకు ఫోన్ చేశారు.

ఇప్పటికీ మూవీలో బాల్యంలో ఉండే సన్నివేశాలు మాత్రమే పూర్తి చేస్తాను. మిగతా సన్నివేశాలకు కలిసి పని చేద్దామన్నారు. నా కోసం ఏకంగా డైరెక్టర్, నిర్మాత, నాగార్జునగారు 6 నెలల పాటు నాకు ఇబ్బంది కలగకుండా నాలుగు రోజులు మాత్రమే పనిచేసే విధంగా షెడ్యూల్ మార్చారు. నాగార్జున ఒక స్టార్ హీరో అయినప్పటికీ, ఆయన ఇండస్ట్రీలో హీరోయిన్ల సమస్యలు బాగా అర్థం చేసుకునే ఒకే ఒక్క మగాడు’ అంటూ పొగిడేసింది.

Advertisement

Next Story

Most Viewed