- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిరంజీవి పెద్దకూతురిపై నాగబాబు షాకింగ్ కామెంట్స్.. ఆమె నన్ను తిడుతుందంటూ..
దిశ, సినిమా: తెలుగు సినీ పరిశ్రమలో మెగా ఫ్యామిలీ అంటే అదో క్రేజ్. చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు మెగా బ్రదర్స్‌గా, నటనా పరంగానూ మంచి ఫేమస్ సంపాదించుకున్నారు. మెగాస్టార్ వాస్తవానికి వివాద రహితుడు. టాలీవుడ్ పరిశ్రమ కూడా ఆయనను పెద్దన్నగా గౌరవిస్తుంది. ఇక ఆయన తమ్ముళ్లు పవన్ కళ్యాణ్, నాగబాబు అయితే ఫైర్ బ్రాండ్స్ అనే చెప్పాలి. సినిమాల పరంగా అందరినీ ప్రోత్సహిస్తారు. కానీ తమ కుటుంబం గురించి ఎవరైనా విమర్శస్తే మాత్రం గట్టి కౌంటర్లు ఇస్తారు. ఇదిలా ఉండగా.. నాగబాబు రీసెంట్‌గా చిరంజీవి పెద్దకూతురు సుస్మిత గురించి చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.
చిరంజీవికి ముగ్గురు సంతానం కాగా, ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. వీరిలో సుస్మిత పెద్ద కూతురు. ఆ తర్వాత రామ్ చరణ్, శ్రీజ. రామ్ ప్రస్తుతం స్టార్ హీరోగా అలరిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక చిన్న కూతురు శ్రీజ ప్రేమ వివాహం చేసుకోవడం, మొదటి భర్తకు, రెండవ భర్తకు కూడా విడాకులివ్వడం, ఆ తర్వాత ప్రస్తుతం సింగిల్‌గానే ఉండటం గురించి అందరికీ తెలిసిందే.
మెగాస్టార్ పెద్ద కూతురు సుస్మిత గురించి మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు. ఆమె ఇండస్ట్రీకి వచ్చాక ఇప్పుడిప్పుడే ఒక్కో విషయం వెలుగులోకి వస్తోంది. నిర్మాణ రంగంలోనూ అడుగు పెట్టిన సుస్మిత ఇప్పటికే పలు ప్రాజెక్ట్స్ నిర్మించింది. రీసెంట్‌గా ఆమె నివేద పేతురాజ్ ప్రధాన పాత్రలో ‘పరువు’ అనే టైటిల్‌తో ఒక వెబ్ సిరీస్ నిర్మించింది. అయితే సిరీస్ ప్రమోషన్స్‌లో పాల్గొన్న నటుడు, చిరంజీవి సోదరుడు నాగబాబు తన అన్నయ్య కూతురు సుస్మిత గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు ‘సుస్మిత చాలా స్ట్రిక్ట్ ఆమె నన్నే కాదు, మమ్మల్నందర్నీ తిడుతుంది. మేమంతా మా నాన్నకు భయపడేవాళ్ళం. కానీ మా నాన్న సుస్మితకు భయపడేవాడు’’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంగా.. వామ్మో సుస్మిత ఇలాంటిదా? అని సరదా కామెంట్లు చేస్తున్నారు జనాలు.