‘వరుణ్ తేజ్’ బర్త్ డే రోజు లావణ్య త్రిపాఠిపై మండిపడ్డ నాగబాబు..?

by Anjali |   ( Updated:2024-01-22 02:18:28.0  )
‘వరుణ్ తేజ్’ బర్త్ డే రోజు లావణ్య త్రిపాఠిపై మండిపడ్డ నాగబాబు..?
X

దిశ, సినిమా: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి దాదాపు ఐదేళ్లు లవ్‌లో ఉండి.. రీసెంట్‌గా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. టాలీవుడ్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ మెగా ఇంటి కోడలైనప్పటి నుంచి తెగ సందడి చేస్తోంది. ఇటీవల వరుణ్ తేజ్ తన 33 వ పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వరుణ్ బర్త్ డే రోజున లావణ్య.. మామ నాగబాబును అవమానించిందంటూ నెట్టింట ఓ వార్త చక్కర్లు కొడుతోంది. పెళ్లయ్యాక మొదటిసారిగా వచ్చిన వరుణ్ బర్త్ డే జీవితంలో ఎప్పటికీ చాలా స్పెషల్ గా గుర్తుండిపోవాలని నాగబాబు.. వరుణ్-లావణ్య కోసం ఒక స్పెషల్ ట్రిప్ ప్లాన్ చేశాడట. బర్త్ డే రోజు ఎలాంటి పనులు పెట్టుకోకండి అని చెప్పారట. లావణ్య ఫస్ట్ ఒకే అని చెప్పిందట. తర్వాత అదే రోజు మిస్ పర్ఫెక్ట్ అనే సినిమాకు డబ్బింగ్ చెప్పడం కోసం డబ్బింగ్ స్టూడియోకు వెళ్లిందట. దీంతో నాగబాబు లావణ్య పై సీరియస్ అయ్యారట. ఈ విషయంలో భర్త వరుణ్ తేజ్ ఇన్వాల్వ్ అయ్యి.. ‘‘సినిమా డైరెక్టర్ అందుబాటులో ఉండరట నాన్న. అందుకే లావణ్య డబ్బింగ్ చెప్పడానికి తప్పక వెళ్లాల్సి వచ్చింది’’. అంటూ తండ్రికి సర్ది చెప్పాడట. ఈ వార్త విన్న మెగా ఫ్యాన్స్ నాగబాబు అంటే లావణ్యకు లెక్కలేదు.. ఆయనను దారుణంగా అవమానించింది అంటూ మండిపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed