సమంత మళ్లీ ఎదురైతే.. నాగచైతన్య అలా చేస్తాడంట

by samatah |   ( Updated:2022-08-10 06:12:00.0  )
సమంత మళ్లీ ఎదురైతే.. నాగచైతన్య అలా చేస్తాడంట
X

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ లవ్‌లీ కపుల్ ఎవరైనా ఉన్నారా అంటే వారు సమంత, నాగచైతన్యనే. ఇక వీరు విడాకులు తీసుకుని విడిపోతామని తెలిపాక ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. వీరు కలవాలని పూజలు చేసినవారు కూడా లేకపోలేదు. అయితే విడిపోయాక సామ్, చై తమ కెరీర్‌పై ఫొకస్ పెట్టి ఎవరిపనుల్లో వారు బిజీ అయిపోయారు. ఇదిలా ఉంటే తాజాగా నాగచైతన్య ఓ ఇంటర్వూలో ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

లాల్ సింగ్ చద్దా సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న చైతన్యను ఓ యాంకర్.. మీకు మళ్లీ సమంత ఎదురైతే ఏం చేస్తారు అనే ప్రశ్న వేసింది. దానికి చై స్పందిస్తూ.. నవ్వుతూ ఆమెకు నేను హాయ్ చేప్తాను అన్నాడు. అంతే కాకుండా నా పర్సనల్ లైఫ్, ఫ్రొఫెషనల్ లైఫ్‌పై దాని ప్రభావం పడకుండా జాగ్రత్త పడుతానని చెప్పుకొచ్చారు. పర్సనల్ లైఫ్ వేరు, ప్రొఫెషనల్ లైఫ్ వేరు నేను వాటి మధ్య తేడాను ఏర్పాటు చేసుకున్నాను అని తెలిపాడు.

ఇవి కూడా చ‌ద‌వండి:

ఫోన్ మాట్లాడేందుకు జంకుతున్న నేతలు.. భయానికి కారణం ఇదే?

ఫ్యాన్స్‌కు నాగచైతన్య సూచన.. షాక్‌లో సమంత

Advertisement

Next Story