- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇప్పటికీ సమంతను మర్చిపోని నాగచైతన్య.. దానిని ఇంకా తన వద్దే ఉంచుకొని.. (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: కొందరు సెలబ్రీటీలు చాలా మంది తమ దగ్గర పనిచేసే వారిని సొంత కుటుంబంగా భావిస్తుంటారు. అందుకే వారికి ఎంతో కొంత సహాయం చేస్తూ వారి చిన్న చిన్న సంతోషాలను పంచుకోవడానికి ఇష్టపడుతుంటారు. తాజాగా, అక్కినేని నాగచైతన్య కూడా అలాంటి పని చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో నాగచైతన్య తన అసిస్టెంట్ సోమ్ బాబు కొన్న కొత్త బైక్‌పై తన ఆటోగ్రాఫ్ పెట్టడంతో పాటు ముందే తానే ఆ బైక్‌ను ఎక్కాడు. దీంతో అదంతా చూసిన అసిస్టెంట్ మొహం వెలిగిపోయింది. అయితే చైతునే ఆ కేటీఎమ్ 390 డ్యూక్ బైక్ కొన్నట్లుగా తెలుస్తోంది. దీనిపై ఆటోగ్రాఫ్ చేయడానికి వస్తున్న సమయంలో పెట్ డాగ్ హ్యాష్ కూడా తనతో ఉండడం గమనార్హం.
ఇదిలా ఉంటే.. సమంత, నాగచైతన్య పెళ్లయిన తర్వాత సమంతకు కుక్కల మీద ఉన్న ఇష్టంతో హ్యాష్ అనే ఒక డాగ్‌ను తెచ్చి పెంచుకోవడం మొదలుపెట్టింది. నాగచైతన్యకు పెట్స్ అంటే పెద్దగా ఇష్టం లేకపోయినా సమంత కోసం హ్యాష్‌ను ఒప్పుకున్నాడు. ఆ తర్వాత హ్యాష్, నాగచైతన్య క్లోజ్ అయిపోయారని సమంత పలు సందర్భాల్లో బయటపెట్టింది. వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత తన పెట్‌ను కూడా తనతో పాటు తీసుకెళ్లిపోయింది సమంత. కానీ తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో మాత్రం నాగచైతన్యతో హ్యాష్ కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
దీంతో నెటిజన్లు సమంతపై ఉన్న ప్రేమతోనే ఆమె పెట్ డాగ్‌ను ఇంకా తనతో ఉంచుకుని పెంచుకుంటున్నాడని అందరూ అనుకుంటున్నారు. అలాగే కుక్కలంటేనే ఇష్టంలేని చైతు సమంత పెట్ డాగ్‌నే అంత ప్రేమగా చూస్తున్నారు త్వరలో సమంతపై ప్రేమతో ఆమెను కూడా కలుసుకుంటాడని చర్చించుకుంటున్నారు. కాగా, సమంత, నాగచైతన్య ‘ఏ మాయ చేసావే’ మూవీతో ప్రేమించుకున్నారు. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి ఘనంగా పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ ఏవో కారణాల వల్ల విడాకులు తీసుకుని విడిపోయారు. ప్రస్తుతం ఎవరి కెరీర్ వారు చూసుకుంటూ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు.