లగ్జరీ కారు కొనుగోలు చేసిన నాగచైతన్య.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

by Jakkula Samataha |   ( Updated:2024-05-21 11:22:13.0  )
లగ్జరీ కారు కొనుగోలు చేసిన నాగచైతన్య.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
X

దిశ, సినిమా : అక్కినేని నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన తన నటనతో ఎంతో మందిని ఆకట్టుకుటున్నాడు. అక్కినేని ఫ్యామిలీ వారుసుల్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడంలో నాగచైతన్య ముందు ఉంటాడు. ఇక నాగచైతన్య సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తర్వాత మనస్పర్థల కారణంగా వీరు విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక నాగచైతన్యకు కార్లు అంటే చాలా ఇష్టం.

ఆయన వద్ద ఎక్కువ ధరతో కూడిన డిఫరెంట్ టైప్ కార్లు బైకులు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. అంతే కాకుండా మార్కెట్‌లోకి ఏ కొత్త కారు వచ్చినా సరే తనకు నచ్చితే తీసేసుకుంటాడు. దాని కాస్ట్ గురించి ఆలోచించడంట. అయితే ప్రస్తుతం మార్కెట్‌లోకి వచ్చి ఓ లగ్జరీ కారును నాగచైతన్య కొనుగోలు చేశారు. ‘Porsche 911 GT3 RS’. ఈ సిల్వర్ కలర్ పోర్షే 911 GT3 కారుని ఈ హీరో ఈ మధ్యనే కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఓ వెబ్ సైట్ ప్రకారం భారతదేశంలో పోర్షే 911 GT3 RS ఎక్స్-షోరూమ్ ధర ₹ 3.51 కోట్లు వరకు ఉండొచ్చని సమాచారం. ప్రస్తతం కారుతో పాటు నాగచైతన్య దిగిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియలో వైరల్ అవుతుంది. ఇక దీని ధర చూసిన నెటిజన్స్ షాక్ అవుతున్నారు.

Read More..

రాజు గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయా: నాగచైతన్య ఆసక్తికర కామెంట్స్

Advertisement

Next Story

Most Viewed