ఆమెతో మరోసారి.. అడ్డంగా బుక్ అయిన నాగచైతన్య

by Vinod kumar |
ఆమెతో మరోసారి.. అడ్డంగా బుక్ అయిన నాగచైతన్య
X

దిశ, సినిమా: అక్కినేని నాగ చైతన్య.. మిస్ ఇండియా శోభితా ధూళిపాళతో డేటింగ్‌లో ఉన్నట్లు కొంతకాలంగా రూమర్స్ వినిపిస్తున్నాయి. కాగా ఈ విషయంపై వీరిద్దరూ ఇప్పటికీ స్పందించలేదు. కానీ పలుచోట్ల ఇద్దరు కలిసి షికార్లు చేసినట్లు కొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి. తాజాగా వీరిద్దరు మరోసారి లండన్‌లో డిన్నర్ డేట్‌కు వెళ్లిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ హోటల్ చెఫ్ నాగచైతన్యతో సెల్ఫీ తీసుకోగా దాన్ని నెట్టింట పోస్ట్ చేశాడు. అయితే ఆ పిక్‌లో వెనుక వైపున శోభితా కనిపించడం విశేషం. దీంతో వీరిద్దరి లవ్ ఇష్యూ మరోసారి చర్చనీయాంశమైంది.

Advertisement

Next Story