చందూ మొండేటి దర్శకత్వంలో న్యూ మూవీ.. స్పెషల్ వీడియో షేర్ చేసిన నాగచైతన్య

by Hamsa |   ( Updated:2023-08-08 12:24:17.0  )
చందూ మొండేటి దర్శకత్వంలో న్యూ మూవీ.. స్పెషల్ వీడియో షేర్ చేసిన నాగచైతన్య
X

దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని హీరో నాగచైతన్య వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్నాడు. చై ఇటీవల నటించిన కస్టడీ, థాంక్యూ సినిమాలు బాక్సాఫీసు వద్ద దారుణమైన ఫలితాలను అందించాయి. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ‘కార్తికేయ-2’ తో హిట్ కొట్టిన దర్శకుడు చందూ మెండేటితో ఓ సినిమా చేయబోతున్న విషయం అందరికీ తెలిసిందే.

తాజాగా, నాగచైతన్య ఈ సినిమాకు సంబంధించిన ఓ స్పెషల్ వీడియోను తన ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ఈ సినిమాలో నాగ చైతన్య మత్సకారుడిగా కనిపించనున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రీ ప్రొడక్షన్స్‌లో భాగంగా ఆంధ్ర ప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలోని ఓ మత్య్స కారుల గ్రామానికి వెళ్లి వాళ్ల జీవన శైలిని పరిశీలించినట్లు హీరో నాగ చైతన్యతో పాటు దర్శకుడు చందూ మొండేటి, నిర్మాత బన్ని వాసులను వీడియోలో చూడొచ్చు. దీనికి చైతు ‘‘NC23 శ్రీకాకుళంలోని మత్స్యకారులను, వారి కుటుంబాలను కలుసుకున్న గొప్ప అనుభవాన్ని కలిగి ఉంది. వారి అనుభవాలను విని, వారి బాధను అర్థం చేసుకోవడం NC 23 కోసం నా పాత్రను నిర్మించడంలో గొప్ప ప్రారంభం ఇదే. త్వరలో షూటింగ్ ప్రారంభమవుతుంది’’ అంటూ క్యాప్షన్‌ను జత చేశాడు. కాగా, ఈ సినిమాలో నాగ చైతన్య సరసన కీర్తి సురేష్ నటిస్తున్నట్టు సమాచారం.

Advertisement

Next Story