వాలెంటైన్స్ డే నాడు అక్కినేని ఇంటికోడలిని పరిచయం చేసిన నాగచైతన్య.. కపుల్ రీల్ వైరల్

by Anjali |   ( Updated:2024-03-07 17:17:46.0  )
వాలెంటైన్స్ డే నాడు అక్కినేని ఇంటికోడలిని పరిచయం చేసిన నాగచైతన్య.. కపుల్ రీల్ వైరల్
X

దిశ, సినిమా: హీరో నాగచైతన్య-నేచురల్ బ్యూటీ సాయిపల్లవి కలిసి నటించిన లవ్ స్టోరీ చిత్రం ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిద్దరి కాంబో యువత నుంచి పెద్దవారికి సైతం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ప్రస్తుతం నాగచైతన్య-సాయిపల్లవి కలయికలో ‘తండేల్’ సినిమా తెరకెక్కుతోంది.

చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ లభించింది. అయితే ఈ గ్లింప్స్ చివర్లో చైతన్య డైలాగ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.‘‘బుజ్జితల్లీ.. వచ్చేత్తున్నా కదే.. కాస్త నవ్వే’’ అనే డైలాగ్‌ను తాజాగా చైతూ చెప్పడం.. దానికి సాయిపల్లవి వెనక్కి తిరిగి నవ్వే వీడియోను యాడ్ చేసి.. ఈ వీడియోను నాగచైతన్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు.

ఈ వీడియో చివర్లో హ్యాపీ వాలెంటైన్స్ డే అని రాసి ఉండటంతో సోషల్ మీడియాలోని జనాలు.. చైతూ స్పెషల్‌గా ప్రేమికుల రోజే ఈ వీడియో షేర్ చేశాడంటే అక్కినేని ఇంటికి కాబోయే కోడలు సాయిపల్లవేనని చైతన్య ఈ వీడియోతో క్లారిటీ ఇచ్చాడు? అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం చై-సాయిపల్లవి క్యూట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Next Story