- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బ్లాక్ బస్టర్ హిట్ డైరెక్టర్‌తో నాగచైతన్య సినిమా ఫిక్స్.. హీరోయిన్ ఎవరంటే?
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య గత కొద్ది కాలంగా హిట్ కోసం తాపత్రయ పడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో ‘తండేల్’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఇందులో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుండగా.. బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తండేల్ సినిమాను అల్లు అరవింద్ గీతా అర్ట్స్‌పై సమర్పిస్తున్నాడు. అయితే ఇందులో మత్స్యకారుడిగా నటిస్తుండగా.. అక్టోబర్ 11న గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా, నాగచైతన్య ఓ బ్లాక్ బస్టర్ హిట్ డైరెక్టర్‌తో సినిమా చేయబోతున్నట్లు సమాచారం. గత ఏడాది విరూపాక్ష సినిమాతో హిట్ కొట్టిన కార్తీక్ వర్మ దండుతో ఓ మూవీకి చైతు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్. దీనిని శ్రీవెంకటేశ్వర బ్యానర్‌పై నిర్మిస్తున్నారట. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో హీరోయిన్‌గా పూజా హెగ్డేను సెలక్ట్ చేసుకున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన ఒక లైలా కోసం మూవీ హిట్ సాధించిన విషయం తెలిసిందే. మరోసారి చై, పూజ జంటగా నటిస్తుండటంతో ఫ్యాన్స్ ఆనంద పడుతున్నారు.