- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్కడ గిల్లితే గిల్లుంచుకోవాలా.. నాగార్జునకి ఉన్న ఆ అలవాటు నచ్చకే సినిమా రిజెక్ట్ చేశా : నదియా
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోల్లో నాగార్జున ఒకరు. అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించాడు. నవ మన్మథుడుగా పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే నాగార్జునకు అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుందనే విషయం మనకు తెలిసిందే. ఇక చాలా మంది హీరోయిన్లు కూడా కింగ్ తో జత కట్టడానికి ఆసక్తి చూపించేవారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఒక హీరోయిన్ మాత్రం ఆయనతో నటించడానికి ఏమాత్రం ఇష్టపడలేదట. ఒకప్పుడు హీరోయిన్‌గా మెప్పించి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్న నదియా గురించి పరిచయం అక్కర్లేదు. ఎక్కువగా తమిళ, మలయాళ సినిమాల్లో కథనాయికగా నటించిన నదియా.. ‘అత్తారింటికి దారేది’లో పవన్ కల్యాణ్ మేనత్త పాత్రతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అయితే నాగార్జున నటించిన ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమా అందరు చూసే ఉంటారు. కాగా ఈ మూవీలో రమ్యకృష్ణ పాత్రలో నటించే అవకాశం ముందుగా నదియాకు వచ్చిందట. అయితే సినిమా కథ మొత్తం విన్న నదియా.. నాగార్జున హీరో అని తెలిసి రిజెక్ట్ చేశారట. ‘ఈ సినిమాలో నాగార్జునకి ఉన్నటువంటి ఒక అలవాటు కారణంగానే ఈ మూవీ రిజెక్ట్ చేశాను. ఈ సినిమాలో ఆయన తరచూ రమ్యకృష్ణ నడుము గిల్లుతూ ఉంటాడు. అలా మాటిమాటికి నడుము గిల్లించుకోవడం ఇష్టం లేదు’ అంటూ నదియా ఈ సినిమాను రిజెక్ట్ చేసిందట.