నా నిర్లక్ష్యం వల్లే జీవితంలో కోలుకోలేని దెబ్బ.. ఇప్పటికి అనుభవిస్తున్నా: నభా నటేశ్‌

by Prasanna |   ( Updated:2024-07-08 14:41:42.0  )
నా నిర్లక్ష్యం వల్లే జీవితంలో కోలుకోలేని దెబ్బ.. ఇప్పటికి అనుభవిస్తున్నా: నభా నటేశ్‌
X

దిశ,సినిమా : ఇస్మార్ట్‌ శంకర్ మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నభా నటేశ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మూవీలో తెలంగాణ స్లాంగ్ తో అందర్ని ఆకట్టుకుంది. ఆ తర్వాత ఈ అమ్మడి కెరియర్ అంతమాత్రంగా ఉంది. సరైన హిట్ లేక బాధతో డిప్రెషన్లోకి వెళ్లిందేమో అని అందరూ అనుకున్నారు. కానీ, కొన్ని రోజులు ఆమె ఎక్కడా కనిపించలేదు. కెరీర్‌ మంచిగా ముందుకు వెళ్తున్న సమయంలో నభా నటేశ్‌ మూవీస్ కి దూరం ఉండటానికి ఓ రోడ్డు ప్రమాదమని బయటకు వచ్చింది.

ఆ సమయంలో నేను చేసిన త్రీ మూవీస్ రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈలోగా గాయం నుంచి కోలుకోవడానికి శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. కానీ, ఆపరేషన్ అయిన 10 రోజుల తర్వాత షూటింగ్ కి వెళ్లి షూటింగ్ పూర్తి చేశాను. అది నా సినీ కెరీర్‌పై ప్రభావం చూపించింది. నా నిర్లక్ష్యం వల్లే జీవితంలో కోలుకోలేని దెబ్బ.. ఇప్పటికి అనుభవిస్తున్నా అంటూ నభా చెప్పింది. దీంతోపాటు మరో ఆపరేషన్ కూడా చేశారు. గాయాలు ,విరిగిన ఎముకలకు చికిత్స చేయాలి దానికి తగినంత సమయం ఇవ్వాలి కదా.. అందుకే కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్నాను. ఏ మూవీ చేస్తే మీకు కనెక్ట్ అవుతా అని ఆలోచిస్తుండగా ‘డార్లింగ్‌’ మూవీ వచ్చిందని.. అలా ఈసినిమా చేశా అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఈ మూవీ జులై 19న థియేటర్లో విడుదల కానుంది.

Advertisement

Next Story