- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పవన్ కల్యాణ్‌కే నా మద్దతు.. వైసీపీకి రేణు దేశాయ్ స్ట్రాంగ్ కౌంటర్ (వీడియో)
దిశ, సినిమా: పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ తాజాగా ‘బ్రో’ సినిమా శ్యాంబాబు వివాదంపై స్పందించింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో సంచలన వీడియో విడుదల చేసింది. ఈ వీడియోలో ‘మా పర్సనల్ లైఫ్ పక్కనపెడితే మొదటి రోజు నుంచి ఇప్పటివరకు పవన్‌ను నేను రాజకీయంగా సపోర్ట్ చేస్తూనే ఉన్నా. ఆయన సమాజం కోసం మంచి చేయాలనుకుంటున్నారు. నాకు తెలిసినంత వరకూ ఆయన అరుదైన వ్యక్తి. ఆయన డబ్బు మనిషి కాదు. డబ్బుపై ఆసక్తి లేదు. సమాజం, పేదవాళ్ల సంక్షేమం కోసం పని చేయాలనుకుంటున్నారు.
రాజకీయంగా ఆయన చేస్తున్న సేవను గుర్తించండి. ఆయనొక గొప్ప నటుడు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఫ్యామిలీని పక్కన పెట్టి రాజకీయాల్లోకి వచ్చారు. దయచేసి ఆయనకు ఒక అవకాశం ఇవ్వండి. ప్రతిసారీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటం.. మూడు పెళ్లిళ్లపై చర్చలు ఆపండి. నా పిల్లలనే కాదు, మిగిలిన ఇద్దరు పిల్లలను ఇలాంటి వాటిలోకి లాగకండి. ఎందుకంటే చిన్నపిల్లలకు ఇవన్నీ తెలియదు. ఏమైనా ఉంటే మీరు మీరు చూసుకోండి. కానీ అనవసరంగా ఫ్యామిలీ, పిల్లలను ఇందులో లాగకండి ఇది నా రిక్వెస్ట్’ అని చెప్పుకొచ్చింది.
Read More..
జనసేనలోకి చిరంజీవి.. నాడు రూ.5వేల కోట్లకు పార్టీ విలీనం : KA Paul
సినీ రంగమేమీ ఆకాశం నుంచి ఊడి పడలేదు.. మెగాస్టార్‌కు YCP ఎంపీ కౌంటర్