వారి వల్లనే నా జీవితం నాశనం అయ్యింది.. భూమిక వైరల్ కామెంట్స్

by Hamsa |   ( Updated:2023-04-29 07:12:25.0  )
వారి వల్లనే నా జీవితం నాశనం అయ్యింది.. భూమిక వైరల్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భూమిక చావ్లా ‘యువకుడు’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పవర్ పవన్ కల్యాణ్ ‘ఖుషీ’ మూవీతో ఫుల్ పాపులారిటీని తన ఖాతాలో వేసుకుంది. బాషతో సంబంధం లేకుండా పలు స్టార్ హీరోల చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా రాణించింది. అవకాశాలు తగ్గుతున్న సమయంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం అవకాశాలు లేకపోవడంతో సినిమాలకు దూరంగా ఉంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న భూమిక తన వ్యక్తిగత విషయాల గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. హిందీలో తేరే నామ్, జబ్ వి మెట్ సినిమాలలో అవకాశాలు ఇచ్చినట్టే ఇచ్చి లాగేసుకున్నారు. దానివల్ల ఇప్పుడు నా కెరీర్ ఇలా ఉంది ఒకవేళ ఆ రెండు సినిమాలు చేసి ఉండి ఉంటే కచ్చితంగా నా కెరియర్ పీక్స్ లో ఉండేది అంటూ చెప్పుకొచ్చింది. కొంతమంది వ్యక్తుల వల్లనే నేను ఆ అవకాశాలను కోల్పోయాను’’ అంటూ చెప్పుకొచ్చింది.

Also Read..

శ్రీముఖి నడుము చూడడానికి సిద్ధమైన చిరు !


Advertisement

Next Story