- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంట్లో చిన్న పూజ గది కూడా లేకుండా చేసాడు మా నాన్న : Nithya Menen
దిశ, సినిమా: మిగిలిన హీరోయిన్స్ మాదిరి గ్లామర్ పాత్రలు చేయకుండా.. ముద్దు సన్నివేశాలకి దూరంగా ఉంటూ.. తనకంటూ ప్రత్యేకమైన లిమిట్స్ ని పెట్టుకున్న హీరోయిన్ నిత్యా మీనన్. ఎలాంటి స్కిన్ షో చేయకుండా మంచి కథలు, పాత్రలను ఎంచుకుంటూ దూసుకుపోతుంది. ఇక రీసెంట్ గా ‘కుమారి శ్రీమతి’ అనే వెబ్ సీరిస్ తో మరోసారి అలరించింది. మూవీస్ విషయం పక్కనపెడితే నిత్యామీనన్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో తన కుటుంబం గురించి పలు విషయాలు పంచుకుంది. ‘మా ఇంట్లో పద్ధతులు చాలా భిన్నంగా ఉంటాయి. మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా నాస్తికులు. అందుకే నా చిన్నతనం నుంచి మా ఇంట్లో పూజ గదులు, దేవుడి విగ్రహాలు చూడలేదు. కానీ అందరూ నాస్తికులు అయినా మా ఇంట్లో వాళ్ళ ప్రభావం నా మీద పడలేదు. నాకు మాత్రం దేవుడిని పూజించాలనే ఉంటుంది. అలా మా ఇంట్లో వారికి తెలియకుండానే దైవాన్ని నమ్మాను’ అంటూ చెప్పుకొచ్చింది నిత్య. ప్రజెంట్ ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
- Tags
- Nithya Menen