Dia Mirza: నా ప్రియుడు నన్ను మోసం చేశాడు.. నాతోనే కాదు నా బెస్ట్ ఫ్రెండ్‌తోనూ అదే పని చేశాడు: నటి దియా మీర్జా

by sudharani |   ( Updated:2023-06-08 13:28:57.0  )
Dia Mirza: నా ప్రియుడు నన్ను మోసం చేశాడు.. నాతోనే కాదు నా బెస్ట్ ఫ్రెండ్‌తోనూ అదే పని చేశాడు: నటి దియా మీర్జా
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మిస్ ఇండియా దియా మీర్జా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మిస్ ఆసియా పసిఫిక్ 2000 టైటిల్ గెలిచిన ఈమె.. నటిగా, మోడల్‌గా, నిర్మాతగా కూడా రాణించారు. ఆమె తెలుగు నటి అయినప్పటికీ బాలీవుడ్ సినిమాల్లో నటించారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తన స్కూల్ డేస్‌లో తనకు జరిగిన మోసం గురించి చెప్పుకొచ్చింది.

‘నేను స్కూల్‌లో ఉన్నప్పుడు నా సీనియర్ నాకంటే వయసులో రెండేళ్లు పెద్ద. అతడు అంటే నాకు చాలా ఇష్టం. ఆ విషయం నేనెప్పుడు తనకి చెప్పలేదు. కానీ, తనకి ఎలా తెలిసిందో తెలియదు. మా ఇంటికి రోజు కాల్ చేసి నీకు ఐ లవ్ యూ చెప్పడానికి చేశా అనేవాడు. నాకు చాలా సంతోషం అనిపించేది. కానీ, కొన్నాళ్లకు తెలిసిందే. అతడు నా బెస్ట్ ఫ్రెండ్‌తో కూడా అలాగే చేస్తున్నాడని. అప్పుడు నేను మోసపోయానని గ్రహించి ఇద్దరం వెళ్లి ప్రిన్స్‌పల్‌కు అతడి మీద కంప్లైంట్ చేశాం’’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా.. దియా మీర్జా ప్రస్తుతం ‘ధక్ ధక్’ లో నటిస్తుంది.

See More..

Kim Kardashian: నా యోని సైజ్ అందరికంటే పెద్దదే.. నిజం ఒప్పుకోవడానికి సిగ్గెందుకు..

Advertisement

Next Story

Most Viewed