- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ కారణంతోనే నాని.. Muralitharan బయోపిక్ రిజెక్ట్ చేశాడా?
దిశ, సినిమా: మరో మూడు రోజుల్లో రిలీజ్ కాబోతున్న ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం బయటకొచ్చింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌గా రికార్డులకెక్కిన శ్రీలంక ప్లేయర్ ముత్తయ్య జీవిత కథ ఆధారంగా వస్తున్న ఈ మూవీని సచిన్ టెండుల్కర్, ముత్తయ్య మురళీధరన్, వీవీఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూళి వంటి దిగ్గజాలు ప్రమోట్ చేయడంతో జనాల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే తాజాగా సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్‌ను నిర్మాత శివలెంక ప్రసాద్ బయటపెట్టాడు.
ఈ మేరకు ఈ కథను ముందుగా నానితో చేయాలనుకున్నామని, అతనికి కథ కూడా నెరేట్ చేశామని చెబుతూ.. ‘ఆయనకు కూడా స్టోరీ బాగా నచ్చింది. అయితే అప్పటికి ‘జెర్సీ’ రిలీజై ఏడాదిన్నర మాత్రమే అయింది. దీంతో నాని అప్పుడే క్రికెట్ బ్యాక్‌గ్రౌండ్‌లో మరో సినిమా అంటే రెడీగా లేనని చెప్పాడు. దీంతో ఏమీ చేయలేకపోయాం’ అని చెప్పుకొచ్చాడు. ఇక ముందుగా విజయ్ సేతుపతితో తెరకెక్కించేందుకు ప్లాన్ చేసి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసిన తర్వాత తమిళనాడులో నిరసన సెగలతో విజయ్ తప్పుకున్నాడు. దీంతో ఆయన ప్లేస్‌లో ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ ఫేమ్ మధుర్ మిట్టర్‌ను ఫైనల్ చేశారు. ఇక ఎం.ఎస్.శ్రీపతి దర్శకత్వంలో వస్తున్న బయోపిక్ అక్టోబర్ 6న తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదలకానుంది.