క్రికెట్ వదిలి ఈ వ్యాపారంలో కోట్లు సంపాదిస్తోన్న స్టార్ క్రికెటర్

by Anjali |   ( Updated:2024-02-25 14:01:17.0  )
క్రికెట్ వదిలి ఈ వ్యాపారంలో కోట్లు సంపాదిస్తోన్న స్టార్ క్రికెటర్
X

దిశ, సినిమా: స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని గురించి సుపరిచితమే. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ధోనీ 2019 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన ఘోర పరాజయం తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నాడు. ఆగస్టు 15, 2020 న తన రిటైర్మెంట్‌ను అధికారికంగా ప్రకటించాడు.

ఇక ధోని కడక్ నాథ్ పౌల్ట్రీ ఫామ్ వ్యాపారాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. చికెన్‌కు ప్రతి చోట డిమాండ్ ఉండటంతో ధోని ప్రస్తుతం ఈ కోళ్ల బిజినెస్ లో కోట్లు సంపాదిస్తున్నాడని సమాచారం. కడక్‌నాథ్ ప్రధానంగా మధ్యప్రదేశ్‌లో కనిపించే కోడి జాతి. అయితే ఇప్పుడు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా పౌల్ట్రీ ఫామ్‌లతో సంబంధం ఉన్నవారు కడక్‌నాథ్‌ను అనుసరిస్తున్నారు. కడక్‌నాథ్ చికెన్ తినడానికి ఎంతో టేస్టీగా ఉంటుందట.

వాటి రెక్కలు, ముక్కు, కాళ్లు, రక్తం, మాంసం అన్నీ నల్లగా ఉంటాయట. ఇంకో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే గుడ్లు కూడా నలుపు రంగులో ఉండటం. సాధారణ చికెన్ కంటే చాలా రెట్లు ఎక్కువ ప్రోటీన్లు, విటమిన్లు ఈ చికెన్‌లో ఉంటాయట. దీంతో అక్కడ చికెన్‌కు అధికంగా ధరలు ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్‌లో కడక్‌నాథ్ కోడి మాంసం కిలో రూ.800 నుంచి రూ.1000 వరకు విక్రయిస్తున్నారు. ఒక్క గుడ్డు ఖరీదు రూ.50కి పైగా ఉంది.

Advertisement

Next Story