ఆ స్టార్‌ హీరోతో ప్రేమలో పడ్డ మృణాల్‌ ఠాకూర్‌.. అతను ఎవరంటే?

by Prasanna |   ( Updated:2023-10-14 10:35:43.0  )
ఆ స్టార్‌ హీరోతో ప్రేమలో పడ్డ మృణాల్‌ ఠాకూర్‌.. అతను  ఎవరంటే?
X

దిశ,వెబ్ డెస్క్: సీతారామం మూవీతో తెలుగు తెరకు పరిచమైన మృణాల్‌ ఠాకూర్‌.. తన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుని .. ఓవర్‌నైట్‌ స్టార్‌డమ్‌ పొందింది. ఒక్కసారిగా యూత్‌ కు నిద్ర లేకుండా చేసింది. అంతలా తన అందచందాలతో మెప్పించింది ఈ బాలీవుడ్‌ భామ. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగు, హిందీ భాషల్లో నటిస్తుంది. తెలుగులో నానితో నటించిన హాయ్‌ నాన్న త్వరలోనే విడుదల కాబోతుంది. ఆ తర్వాత సంక్రాంతికి విజయ్‌ దేవరకొండతో కలిసి నటించిన సినిమా రిలీజ్‌ కాబోతుంది.

ఇదిలా ఉండగా.. తాజాగా తన రిలేషన్‌ స్టేటస్‌ గురించి బయట ఈ బ్యూటీ బయట పెట్టింది. పెళ్లి విషయంలో ఫ్యామిలీ నుంచి ఒత్తిడి ఉందని, తను మాత్రం కెరీర్‌పైనే ఫోకస్‌ పెట్టాటని చెప్పుకొచ్చింది. ఎవరితోనైనా ప్రేమలో పడ్డారా అని మీడియా వాళ్లు అడిగితే.. 'హాలీవుడ్‌ హీరో కీను రీవ్స్‌ అంటే తనకు చాలా ఇష్టమని, అతన్ని చూసి మొదటి సారే.. ప్రేమలో పడ్డానని చెప్పుకొచ్చింది. కానీ తనది వన్‌సైడ్‌ లవ్‌ మాత్రమేనని , కీను రీవ్స్‌ లాంటి వ్యక్తి తన జీవిత భాగస్వామిగా రావాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చింది. దీని పై స్పందించిన ఆమె అభిమానులు.. వన్‌సైడ్‌ లవ్వే కదా.. అంటూ రిలాక్స్‌ అవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed