Mrunal Thakur: మ్యూజికల్‌ లవ్‌స్టోరీతో రాబోతున్న మృణాల్ ఠాకూర్.. హీరో ఎవరంటే?

by Anjali |
Mrunal Thakur: మ్యూజికల్‌ లవ్‌స్టోరీతో రాబోతున్న మృణాల్ ఠాకూర్.. హీరో ఎవరంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, మరాఠీ భాషల్లో కూడా నటించి ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకుంది. తెలుగులో సీతారామం సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. తెలుగు ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. తర్వాత హాయ్ నాన్నా, ది ఫ్యామిలీ స్టార్, కల్కి 2898 వంటి చిత్రాల్లో అద్భుతంగా నటించింది. నందన్ గారు నమస్కారం, విట్టి దండు, సురాజ్య, సోనియాను ప్రేమించండి, సూపర్ 30, బాట్లా హౌస్, ఘోస్ట్ స్టోరీస్, టూఫాన్, ధమాకా, జెర్సీ, జహాన్ (షార్ట్ ఫిల్మ్), గుమ్రాహ్, లస్ట్ స్టోరీస్ 2, ఆంక్ మిచోలీ వంటి హిందీ, మరాఠీ చిత్రాల్లో కూడా నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పూజా మేరీ జాన్, హై జవానీ తో ఇష్క్ హోనా హై, సర్దార్ 2 కుమారుడు చిత్రాల్లో నటిస్తోంది.

అలాగే బాలీవుడ్‌లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. ‘తూ హీ హో’ అనే సినిమాలో సిద్ధార్థ్ చతుర్వేది సరసన మృణాల్ నటిస్తోంది. ఈ మూవీని ప్రముఖ డైరెక్టర్ సంజయ్‌లీలా భన్సాలీ నిర్మించగా.. రవి ఉద్యవార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది బాలీవుడ్ లోనే అద్భుతమైన ప్రేమకథగా తెరకెక్కబోతుందట. ఈ చిత్రంలో నాయకానాయికలు సిద్ధార్థ్‌ చతుర్వేది, మృణాల్‌ ఠాకూర్‌ ఇద్దరూ మ్యూజిషియన్స్‌గా కనిపించనున్నారట. ఈ చిత్ర షూటింగ్ కోసం ఉత్తరాఖండ్‌లోని అద్భుతమైన లొకేషన్లలో నెక్ట్స్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట దర్శక, నిర్మాతలు. ఈ వార్త విన్న జనాలు మరో తెగ ఎగ్జైటింగ్‌గా ఫీల్ అవుతున్నారు. మరో అషికీ-2 బ్లాక్ బస్టర్ కాంబో రిపీట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


Advertisement

Next Story

Most Viewed