సినిమాల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న మృణాల్ ఠాకూర్..!

by Hamsa |   ( Updated:2024-06-03 07:57:28.0  )
సినిమాల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న మృణాల్ ఠాకూర్..!
X

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ సీతారామం మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. పలు సీరియల్స్ చేసిన ఆమె మొదటి సినిమాతోనే హిట్ అందుకుని ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. దీంతో ఈ అమ్మడుకి వరుస అవకాశాలు వచ్చాయి. హాయ్ నాన్నతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న మృణాల్.. ఇటీవల ఫ్యామిలీ స్టార్ చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. అయితే ఈ మూవీ పెద్దగా విజయం అందుకోలేకపోయింది. ఈ క్రమంలో మృణాల్‌కు ఆఫర్లు తగ్గిపోయాయని తెలుస్తోంది. దీంతో ఆమె ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

గతంలో తండ్రి పెట్టిన కండీషన్‌ కోసం బోల్డ్ సీన్స్‌లో నటించలేదని టాక్. అయితే ఇప్పుడు తండ్రి మాటను కాదని అవకాశాలు కోసం బోల్డ్ సీన్స్ లోనూ నటించేందుకు రెడీ అయిందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఎలాగైనా మొదట్లో ఉన్నంత క్రేజ్ సంపాదించుకునే ప్రయత్నంలో ఉన్న ఆమె బోల్డ్ సీన్స్ నటించడానికి రెడీ అయింది. ప్రస్తుతం ఇదే న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దీంతో ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. మరికొందరు మాత్రం మృణాల్ బోల్డ్ సీన్స్ చేస్తే.. కొంతమంది హీరోయిన్స్‌ను వెనక్కి నెట్టి ఇండస్ట్రీని షేక్ చేస్తుందని అంటున్నారు.

Advertisement

Next Story