Mrunal Thakur : ఆ స్టార్ క్రికెటర్‌తో పిచ్చి ప్రేమలో మృణాల్ ఠాకూర్.. షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన యంగ్ బ్యూటీ

by Kavitha |
Mrunal Thakur : ఆ స్టార్ క్రికెటర్‌తో పిచ్చి ప్రేమలో మృణాల్ ఠాకూర్.. షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన యంగ్ బ్యూటీ
X

దిశ, సినిమా: ‘సీతారామం’ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. తన మొదటి సినిమాతోనే ఓవర్ నైట్‌స్టార్ అయిపోయింది. దీంతో ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఈ క్రమంలో ది ఫ్యామిలీ స్టార్, హాయ్ నాన్న వంటి మూవీస్‌లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో మరో సినిమాను ప్రకటించలేదు. కానీ నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన అందాలతో అదరహో అనిపిస్తుంది.

ఇదిలా ఉంటే బేసిక్‌గా ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్స్ అన్నాక రూమర్స్ రావడం కామన్. ఒక హీరో నచ్చాడు అని చెప్పడమే ఆలస్యం వారి ఇద్దరి మధ్య ఏదో ఉందని రూమర్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా మృణాల్‌ ఓ తెలుగు హీరోతో డేటింగ్‌లో ఉందని త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ఓ పుకారు షికారు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో తాజాగా మృణాల్.. విరాట్ కోహ్లీ ప్రేమలో ఉన్నట్లు మరో వార్త గుప్పుమంది.

దీనిలో భాగంగా స్టార్ క్రికెటర్ విరాట్ పై మృణాల్ మనసు పారేసుకుందని, ఇప్పుడు అనుష్క పరిస్థితి ఏంటి అని అర్థం వచ్చే విధంగా ఒక బాలీవుడ్ మీడియా మృణాల్ పై రూమర్స్ క్రియేట్ చేసింది. దానికి సాక్ష్యంగా గతంలో మృణాల్.. విరాట్ గురించి, సచిన్ గురించి మాట్లాడిన మాటలను చూపించింది. గతంలో మృణాల్ మాట్లాడుతూ.. ” క్రికెటర్ విరాట్ కోహ్లీ అంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో నేను ప్రేమలో ఉన్నాను. అలాగే సచిన్ టెండూల్కర్ అంటే కూడా ఇష్టం. నా సోదరుడు వలన నాకు క్రికెట్ అలవాటు అయ్యింది. ఐదేళ్ల క్రితం అతనితో మ్యాచ్ చూసిన జ్ఞాపకాలు ఇంకా గుర్తున్నాయి. స్టేడియంలో ఇండియా జెర్సీ వేసుకొని వారిని ఉత్సాహ పరిచిన నేను.. ఇప్పుడు జెర్సీ సినిమాలో నటించడం మరింత ఆనందాన్ని అందిస్తుంది” అని చెప్పుకొచ్చింది. ఇక ఆ మాటలను ఇప్పుడు ఒక బాలీవుడ్ మీడియా మరోసారి హైలైట్ చేస్తూ ఇన్స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. అవి కాస్తా వైరల్‌గా మారాయి. ఇక ఈ పుకార్లపై మృణాల్ స్పందించి.. ఇలాంటివి ప్రచురించడం ఆపండీ అంటూ స్ట్రాంగ్‌గా వార్నింగ్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.




Advertisement

Next Story