Mr. Bachchan: మిస్టర్‌ బచ్చన్‌ రివ్యూ.. ఘోరమైన ట్రోల్స్ ఎదుర్కొంటున్న హరీష్

by sudharani |   ( Updated:2024-08-15 15:42:32.0  )
Mr. Bachchan: మిస్టర్‌ బచ్చన్‌ రివ్యూ.. ఘోరమైన ట్రోల్స్ ఎదుర్కొంటున్న హరీష్
X

నటీనటులు: రవితేజ, భాగ్యశ్రీ బోర్సే, జగపతిబాబు, సత్య, సత్యం రాజేష్‌ తదితరులు

సాంకేతిక నిపుణులు: సంగీతం: మిక్కి.జే.మేయర్‌, సినిమాటోగ్రఫీ: అయాంక బోస్‌

నిర్మాణ సంస్థ: పీపుల్‌ మీడియా, నిర్మాత: టీజీ విశ్వప్రసాద్‌, దర్శకత్వం: హరీష్‌ శంకర్‌.

దిశ, సినిమా: రవితేజ, హరీశ్‌ శంకర్‌ కాంబినేషన్‌ అనగానే ఆడియన్స్‌లో ఓ ఆసక్తి మొదలవుతుంది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో రూపొందిన చిత్రమే 'మిస్టర్‌ బచ్చన్‌' ప్రచార చిత్రాల్లో మాస్‌ అంశాలు, భాగ్యశ్రీ గ్లామర్‌,డ్యాన్సులు ఈ సినిమాపై అంచనాలను పెంచాయి. అంతేకాదు ఈ చిత్ర దర్శకుడు హరీష్‌ శంకర్‌ అగ్రెసివ్‌ ప్రమోషన్స్‌ కూడా సినిమాపై హైప్ తీసుకొచ్చాయి. ఇక ఈ గురువారం ఆగస్టు 15న బరిలో నిలిచి.. విడుదలైన మిస్టర్‌ బచ్చన్‌ హంగామా కేవలం పబ్లిసిటీ వరకు పరిమితమైందా? లేక వెండితెరపై కూడా సత్తా చాటిందా తెలియాలంటే రివ్యూ చదవాల్సిందే..

కథ: ఇన్‌కమ్‌ట్యాక్స్‌ ఆఫీసర్‌గా పనిచేసే బచ్చన్‌ ఓ సారి అవినీతి పరుడైన ఓ వ్యాపారిపై తన తోటి ఆదాయపు పన్ను అధికారులతో కలిసి రైడ్‌ చేసి భారీ మొత్తంలో నల్లదనాన్ని పట్టుకుంటాడు. కానీ అనూహ్యంగా బచ్చన్‌ ఉన్నతాధికారులు బచ్చన్‌ను ఉద్యోగం నుంచి టెంపరరీగా తొలగిస్తారు. ఇక చేసేది లేక సొంతూరుకు వెళ్లి అక్కడ స్నేహితులతో కలిసి ఆర్కెస్ట్రా గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకుని పాటలు పాడుతుంటాడు. చిన్నప్పటి నుండి పాటలు పాడటమంటే బచ్చన్‌కు చాలా ఇష్టం. ఇక సొంతూరులోనే తొలిచూపులోనే జిక్కీ (భాగ్యశ్రీ బోర్సే)ను ప్రేమిస్తాడు. అతని స్వభావం, మంచితనం చూసి జిక్కీ కూడా అతడ్ని ప్రేమిస్తుంది. ఇక ఒకసారి బచ్చన్‌ వాళ్ల ఇంటికి ముత్యం జగ్గయ్య (జగపతిబాబు) మనుషులు వచ్చి బచ్చన్‌ అమ్మ నాన్నలతో పాటు జిక్కీని కూడా కొడతారు. విషయం తెలుసుకున్న బచ్చన్‌ రాష్టం నుండి కేంద్రం వరకు పరపతి వున్న ఎంపీ ముత్యం జగ్గయ్య మనుషులను బచ్చన్‌ కూడా కొడతాడు అంతేకాదు అనుకోకుండా మళ్లీ తన ఉద్యోగం తిరిగి వచ్చిన తరువాత బచ్చన్‌, ముత్యం జగ్గయ్య ఇంటిపై ఇన్‌కమ్‌టాక్స్‌ రైడింగ్‌కు వెళతాడు? అప్పుడు జరిగిందేమిటి? ముత్యం జగ్గయ్యను బచ్చన్‌ ఎలా ఎదుర్కొన్నాడు? జిక్కీ, బచ్చన్‌ల ప్రేమ ఫలించిందా? లేదా అనేది మిగతా కథ

విశ్లేషణ: వాస్తవ సంఘటనల ఆధారంగా బాలీవుడ్‌లో అజయ్ దేవగన్ హీరోగా రూపొందిన 'రైడ్‌' చిత్రం రీమేక్‌ హక్కులు తీసుకుని, కథలో దర్శకుడు హరీశ్‌ శంకర్‌ మార్పులు చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అయితే ఓ డీసెంట్‌ కథలో అర్థం పర్థం లేని కమర్షియాలిటి కోసం హరీశ్‌ శంకర్‌ చేసిన మార్పులు పెద్దగా అలరించలేదు. అజయ్ దేవగన్ నటించిన రైడ్‌ చిత్రానికి రీమేక్‌గా మిస్టర్‌ బచ్చన్‌ను తెరకెక్కించారు హరీశ్‌ శంకర్‌. అయితే రైడ్‌ కథను పూర్తిగా మార్చేసి తనదైన శైలిలో రొమాంటిక్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించాలన్న హరీష్‌శంకర్‌ ప్రయత్నం ఫలించలేదు. ఆసక్తికరంగా లేని కథ, కథనాలతో మిస్టర్‌ బచ్చన్‌ను బోరింగ్‌ సినిమాగా తయారుచేశాడు దర్శకుడు. రొటీన్‌ సన్నివేశాలతో... నవ్వురాని కామెడీతో.. ఎటువంటి లాజిక్‌ లేకుండా చిత్రాన్ని రూపొందించాడు. ఏ సన్నివేశం ఎందుకు వస్తుందో.. తెలియకుండానే ఫస్టాఫ్ పూర్తవుతుంది. ఇక సెకండాఫ్‌ సినిమా మొత్తం చూడాలంటే ఖచ్చితంగా ప్రేక్షకుడిక పరీక్షే.. సోషల్‌మీడియాలో ఎంతో యాక్టివ్‌గా వుంటూ.. ప్రతి దానికి లాజిక్‌గా సమాధానమిచ్చే హరీష్‌ శంకర్‌.. ఎటువంటి లాజిక్‌, మీనింగ్‌ లేకుండా కొన్నిసన్నివేశాలు తెరకెక్కించడం నిజంగా ఆశ్చర్యపరుస్తుంది. ముఖ్యంగా ఇన్‌కమ్‌ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫీసర్లను ఏదో కుటీర పరిశ్రమ పెట్టుకున్న వ్యక్తులుగా చూపించారు. హీరోయిన్‌ భాగ్యశ్రీ బోర్సేను కేవలం గ్లామర్‌కే పరిమితం చేసి.. ఆమె పాత్రను మలిచిన విధానం ఆకట్టుకోదు. కథ మీద కాన్‌సన్‌ట్రేషన్‌ లేకుండా, హీరోను ,హీరోయిన్‌ను హైలైట్‌ చేయడమే పనిగా పెట్టుకుంటే.. కథ పక్కదారి పడుతుంది అనడానికి మిస్టర్‌ బచ్చన్‌ ఒక ఉదాహరణ. రొటీన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను నిరాశపరుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. హీరో రవితేజలో కనిపించిన హుషారు కథ, కథనంలో కనిపించలేదు. పాటల్లో వున్న హుషారు మచ్చుకైనా సన్నివేశాల్లో కనిపించదు. ఇన్‌కమ్‌ట్యాక్స్‌ ఆఫీసర్లపై, వాళ్ల రైడ్‌పై ఏ మాత్రం అవగాహన లేకుండా ఆ ఎపిసోడ్‌ను ఎంతో హస్యాస్పదంగా చిత్రీకరించారు. హరీశ్‌ శంకర్‌ హిట్‌ కావాలనే ఆరాటంలో మాస్‌ మసాలా పేరుతో ఏ మాత్రం ఆకట్టుకోలేని సన్నివేశాలను, సంభాషణలను చిత్రంలో జొప్పించాడు. ఏ సన్నివేశానికి లాజిక్‌ వుండదు... అంతా ల్యాగే.. అనవసరపు కామెడీ.. అరిగిపోయిన డైలాగులు...రీమేక్‌ను రీమేక్‌గా తీస్తే రియలైజ్‌ అయ్యే అవసరం వచ్చి వుండేది కాదు...హరీష్‌ శంకర్‌ హిట్‌ కోసం కసితో తీశాడు... కసితో తీసిన కథ కావాలనే విషయాన్ని కంగారులో మర్చిపోయాడు.. వజ్రాన్ని వెతుక్కునే ప్రాసెస్‌లో జేబులో వున్న బంగారాన్ని పొగొట్టుకున్నాడు.. (రీమేక్‌ కథను పూర్తిగా మార్చేసి అసలు కథను మర్చిపోయాడు)

ఫైనల్‌గా : పరమ్‌ రొటిన్‌ బచ్చన్‌ కావడంతో ఘోరమైన ట్రోల్స్ ఎదుర్కొంటున్నాడు హరీష్ శంకర్.

రేటింగ్‌ 1.5/5

Advertisement

Next Story

Most Viewed