మోహన్ బాబు, ప్రభాస్ ఆడవాళ్ళ మాదిరి అలా చేస్తారు.. మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్స్!

by Hamsa |
మోహన్ బాబు, ప్రభాస్ ఆడవాళ్ళ మాదిరి అలా చేస్తారు.. మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్స్!
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. లక్ష్మి పలు సినిమాల్లో నటించి నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని కొద్ది కాలం పాటు ఇండస్ట్రీలో కొనసాగింది. కానీ ఆ తర్వాత పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పేసి సోషల్ మీడియాకు దగ్గరైంది. హద్దులు చెరిపేసి వయస్సుతో సంబంధం లేకుండా హీరోయిన్స్‌ను మించిని గ్లామర్ షో చేసింది. దీంతో అవి చూసిన నెటిజన్లు దారుణమైన ట్రోల్స్ చేశారు. అయినప్పటికీ పట్టించుకోకుండా వరుస పోస్టులతో నెట్టింట సంచలనం సృష్టించింది. ఇటీవల మళ్లీ ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చింది.

తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు లక్ష్మి ప్రభాస్, మోహన్ బాబు గురించి ఓ షాకింగ్ విషయాన్ని తెలిపింది. ‘‘మా నాన్న ప్రభాస్ ఫోన్ చేసుకొని వంటల గురించి మాట్లాడుకుంటారు. డార్లింగ్ ఆహార ప్రియుడు అని అందరికీ తెలుసు. అలాగే మా నాన్న కూడా అంతే. ఇక ఈ ఇష్టంతోనే వీరిద్దరు కాలీ సమయంలో ఒకరికి ఒకరు ఫోన్లు చేసుకొని ఆడవాళ్ళ మాదిరి వంటల గురించి మాట్లాడుకుంటారు. మీ ఇంట్లో ఏ కూర అని తెలుసుకుంటారు. అంతే కాకుండా పంపించుకుంటారు కూడా. కొన్ని వంటలు మాత్రం ఎలా తయారుచేస్తారో తెలుసుకుంటారు. వీరిద్దరు బుజ్జిగాడు మూవీ చేసినప్పటికీ నుంచి ఇలా ఫోన్లు చేసుకుని మాట్లాడుకుంటున్నారు’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం లక్ష్మి కామెంట్స్ వైరల్ అవుతుండగా.. అంత పెద్ద స్టార్ అయి ఉండి వంట గురించి మాట్లాడుకుంటారా ఫుడ్ అంటే అంత పిచ్చా అని అనుకుంటున్నారు.

Advertisement

Next Story